Phonepe : ఫోన్‌పేలో 20వేలు కొట్టించుకొని పరారైన ర్యాపిడో డ్రైవర్.. దొంగ దొరికాడా..?
ప్రధానాంశాలు:
Phonepe : ఫోన్‌పేలో 20వేలు కొట్టించుకొని పరారైన ర్యాపిడో డ్రైవర్.. దొంగ దొరికాడా..?
Phonepe : ఈ రోజుల్లో మోసాలు ఎంత సులువుగా మోసం చేస్తున్నారో మనం చూస్తున్నాం. కాస్త అజాగ్రత్తగా ఉంటే చాలు మొత్తం మాయం చేస్తున్నారు.ఆఫ్‌లైన్‌లో, ఆన్‌లైన్‌లో మోసాలు బాగా జరుగుతుండడం, వాటిపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టి నిందితులకి కఠిన శిక్ష విధించిన కూడా మోసాలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి తమకు ఫోన్ పే, గూగుల్ పేలో డబ్బులు పంపించండి, మేము క్యాష్ ఇస్తామని చెప్పి డబ్బులు అకౌంట్‌లో పడగానే మెల్లగా జారుకుంటున్నారు. అలాంటి వారి పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. తాజాగా తార్నాకలోని హెచ్‌పి పెట్రోల్ బంక్‌లో జరిగిన సంఘటన అందరిని ఆశ్చర్యపరుస్తుంది.
నమ్మించి మోసం చేశాడు..
ఏప్రిల్ 5 రాత్రి 10 గంటల సమయంలో బంకులో పనిచేసే సర్వీస్ బాయ్ వద్దకు ఓ వ్యక్తి వచ్చి తన 20 వేలు అర్జెంట్ అవసరం ఉందని, అవి ఆన్‌లైన్‌లో పంపిస్తే తాను క్యాష్ ఇస్తానని చెప్పాడు. అయితే సర్వీస్ బాయ్ క్యాష్ ట్రాన్సఫర్ చేశాడు. క్యాష్ వచ్చిన వెంటనే గుర్తుతెలియని వ్యక్తి అక్కడి నుండి జారుకున్నాడు. అయితే సర్వీస్ బాయ్ అతన్ని వెంబడించిన ఉపయోగం లేకుండా పోయింది. ఇక వెంబడించే క్రమంలో సర్వీస్ బాయ్‌కి తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. అయితే గుర్తు తెలియని వ్యక్తి కోసం ఎంత వెతికిన లాభం లేకపోవడంతో సర్వీస్ బాయ్ స్థానిక ఓయూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఇక పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
అయితే ట్రాన్స్‌ఫర్ చేసిన ఫోన్ నెంబర్ ఆధారంగా విచారణ చేయగా.. ట్రాన్స్‌ఫర్ చేసిన డబ్బులు డ్రా చేసుకోవడానికి హబ్సిగూడలోని ఒక ఏటీఎం వద్దకు వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. వెంటనే అక్కడికి వెళ్లి అతనిని అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు. సదరు నిందితుడు ర్యాపిడో డ్రైవర్‌గా పని చేస్తూ షాపూర్ నగర్‌లో నివాసం ఉంటున్న సాబిల్‌గా గుర్తించారు. అయితే ఫ్యూచర్‌లో అయిన ఇలాంటి వ్యక్తుల పట్ల బంకు యాజమాన్యాలు, వ్యాపారస్తులు అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి చెప్పుడు మాటలకి మోసపోవద్దని సూచించారు.