PM Kisan : రైతులకు గుడ్ న్యూస్… రేపే పీఎం కిసాన్ నిధులు విడుదల…!
PM Kisan ; ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనేది రైతులకు కనీస ఆదాయం మద్దతుగా సంవత్సరానికి 6000 వరకు అందించే భారత ప్రభుత్వం యొక్క పథకం. ఈ పథకం 2018 సంవత్సరంలో డిసెంబర్ నెలలో ఈ పథకాన్ని ప్రారంభించారు. పీఎం కిసాన్ పథకం కలిగి ఉన్న రైతులు కుటుంబాల అందరికీ ప్రతి కుటుంబానికి సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం6000 చొప్పున ఆర్థిక ప్రయోజనాన్ని అందిస్తుంది. ప్రతి నాలుగు నెలలకు 2000 చొప్పున మూడు సమాన వాయిదాలలో అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఆర్థికపరంగా ఉండగా ఉండాలని ఉద్దేశంతో ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని అమలుపరిచింది.
ఈ పథకంతో రైతులు ఆర్థికంగా సహాయం అందుకుంటున్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఎంతో మంది రైతులు ఆర్థికంగా సహాయం అందుకుంటున్నారు. ఈ పథకం పెట్టి మూడు సంవత్సరాలు కావస్తుంది. అయితే రైతులందరికీ దీపావళి ముందు కేంద్రం తీపి కబురు చెప్పబోతుంది. రైతులకు ప్రధాని నరేంద్ర మోడీ అందిస్తున్న ప్రధానమంత్రి కిసాన్ నిధి పథకం ద్వారా 6000 రైతులకు అందిస్తుంది. ఈ పథకం ద్వారా రైతులు 2000 చొప్పున మూడుసార్లు తమ ఖాతాలోకి డబ్బు చేరుతున్నాయి. అయితే ఇప్పుడు 12వ విడత డబ్బులను రైతుల ఖాతాలోకి వేయడానికి కేంద్రం రెడీగా ఉంది.
అయితే రైతుల ఖాతాలోకి మరోసారి నగదు బదిలీ చేసేందుకు రంగం సిద్ధమైంది. పీఎం కిసాన్ పథకం కింద 12వ విడత నిధులు విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముహూర్తం ఓకే చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో రెండు రోజులపాటు నిర్వహించి పీఎం కిసాన్ సమ్మాన్ సమ్మేళన్ 2022 సదస్సును సోమవారం ప్రధాని ప్రారంభించనున్నారు. రెండు రోజులపాటు జరగనున్న ఈ సమావేశం వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ 12వ విడత నిధులు పంపిణీ ప్రారంభిస్తారు. ఆ వెంటనే పథకం కింద అర్హులైన రైతులందరికీ ఖాతాల్లో నగదు బదిలీ అవుతుంది. రేపటి నుంచి రైతుల ఖాతాలో డబ్బులు పడనున్నాయి.