Heeraben Modi : తుది శ్వాస విడిచిన ప్రధాని మోదీ తల్లి హీరాబెన్..!!
Heeraben Modi : గత మంగళవారం ప్రధాని మోడీ తల్లి అనారోగ్యానికి గురి కావడం తెలిసిందే. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను అహ్మదాబాద్‌లోని యూఎన్ మెహతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్లో చేర్పించారు. ఆ సమయంలో తల్లి అనారోగ్యం వార్త తెలుసుకొని ప్రధాని మోడీ అహ్మదాబాద్ కి చేరుకున్నారు. దాదాపు గంటన్నర సేపు హాస్పిటల్ లో మోడీ గడపడం జరిగింది. ఆ తర్వాత పరిస్థితి మొత్తం తెలుసుకొని ఢిల్లీకి చేరుకున్నారు.
అయితే ఆమెకు అందిస్తున్న చికిత్స ఫలించకపోవడంతో… కొద్దిసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. ఈ ఏడాది జూన్ నెలలో హీరాబెన్ 100వ ఏట అడుగు పెట్టడం జరిగింది. హాస్పిటల్ లో ఆమెకు అందిస్తున్న చికిత్స సఫలీకృతం అవుతుందని రెండు రోజుల్లో ఆమె డిస్చార్జ్ అవుతారని బిజెపి నేతలు భావించారు. అయితే హఠాత్తుగా ఆమె మరణించిన వార్త మోడీ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది.
హీరాబెన్ మృతి పట్ల పలువురు బిజెపి నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రధాని మోడీకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఇటీవల గుజరాత్ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో హీరాబెన్ పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు కూడా వినియోగించుకున్నారు. ఈ క్రమంలో తల్లి మరణం పై నరేంద్ర మోడీ సోషల్ మీడియాలో స్పందించారు. నిండు నూరేళ్లు పూర్తి చేసుకుని ఈశ్వరుడు చెంతకు చేరారని మోడీ భావోద్వేగానికి గురయ్యారు.