Pongal Special : మకర సంక్రాంతి రోజున ఈ పనులు మస్ట్‌గా చేయాలి.. ఇవి అస్సలు చేయొద్దు.. అవేంటంటే? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Pongal Special : మకర సంక్రాంతి రోజున ఈ పనులు మస్ట్‌గా చేయాలి.. ఇవి అస్సలు చేయొద్దు.. అవేంటంటే?

Pongal Special : హిందూ సంప్రదాయాల ప్రకారం.. మకర సంక్రాంతి పండుగ అత్యంత విశిష్టమైనది. దేశంలోనే అనేక ప్రాంతాల్లో ఈ ఫెస్టివల్ ను చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ పండుగకు ప్రతీ ఒక్కరు దాదాపుగా తమ సొంతూళ్లకు వెళ్లి హాయిగా గడిపేస్తుంటారు. అలా ఈ మకర సంక్రాంతి జనాలకు అత్యంత ఇష్టమైన పండుగ. కాగా, ఈ పండుగ రోజున శాస్త్రం ప్రకారం ఏం చేయాలి? ఏం చేయకూడదు? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.మకర సంక్రాంతి […]

 Authored By mallesh | The Telugu News | Updated on :11 January 2022,9:30 am

Pongal Special : హిందూ సంప్రదాయాల ప్రకారం.. మకర సంక్రాంతి పండుగ అత్యంత విశిష్టమైనది. దేశంలోనే అనేక ప్రాంతాల్లో ఈ ఫెస్టివల్ ను చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ పండుగకు ప్రతీ ఒక్కరు దాదాపుగా తమ సొంతూళ్లకు వెళ్లి హాయిగా గడిపేస్తుంటారు. అలా ఈ మకర సంక్రాంతి జనాలకు అత్యంత ఇష్టమైన పండుగ. కాగా, ఈ పండుగ రోజున శాస్త్రం ప్రకారం ఏం చేయాలి? ఏం చేయకూడదు? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.మకర సంక్రాంతి పండుగ రోజున సూర్య భగవానుడు, శని దేవుడిని పూజించాలి. ఈ రోజున దానధర్మాలు చేయడం వల్ల ఇంట్లో సుఖశాంతులతో కూడిన వాతావరణం నెలకొంటుందని ప్రజల విశ్వాసం.

సూర్యుడికి ఈ రోజున పూజలు చేస్తే కనుక చక్కటి ప్రయోజనాలు కలుగుతాయని పండితులు వివరిస్తున్నారు. ఈ పండుగ రోజున నువ్వులతో చేసిన వస్తువులను కంపల్సరీగా దానం చేయాలి. అలా చేయడం వలన చాలా ఉపయోగాలుంటాయట. 14 రకాల వస్తువులను దానం చేయాలి. ఈ రోజున దానం చేస్తే కనుక మిగతా రోజుల్లో చేసిన దానాల కంటే కూడా ఎక్కువ రెట్ల ప్రయోజనం కలుగుతుంది.కపోతే ఈ రోజున ఏం చేయకూడదనే కూడా తెలుసుకోవాలి.

pongal special dont do these things on makara sankranti day

pongal special dont do these things on makara sankranti day

Pongal Special : వీటిని దానం చేస్తే చాలా మంచిది..

ఇఈ రోజున దాన, ధర్మాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉన్న క్రమంలో ఈ రోజున ఎవరైనా ఇంటికి వస్తే కనుక ఖాళీ చేతులతో అస్సలు బయటకు పంపొద్దు. అతనికి ఏదో ఒక తిను బండారాలు ఇవ్వాలి. ఇకపోతే ఈ రోజున అందరూ పవిత్రంగా పూజలు చేస్తుంటారు. కావున ఈ రోజున అందరూ కూడా మద్యం తీసుకోకూడదు. మిగతా రోజుల్లో ఎలా ఉన్నా కనీసంగా ఈ రోజు అయినా మద్యానికి దూరంగా ఉండటం అనేది చాలా ముఖ్యం. ఉపవాసం ఉండే వారు అయితే కంపల్సరీగా నిష్టగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ స్నానం, పూజకు ముందర ఆహారం తీసుకోకూడదు.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది