pooja : ఏ వారం నాడు ఏం పూజ చేయాలి ?
pooja పూజ.. చేయని భక్తులు ఉండరు. ప్రతీరోజు ఏదో ఒక పూజ చేస్తూ భగవంతుని అనుగ్రహం కోసం ఎదరుచూస్తారు అందరూ. అయితే ఆయా రోజుల్లో విశేషంగా పూజలు చేసినా నిత్యం కనీసం దీపారాధన, స్తోత్రపారాయణం, నామజపం చేయడం తప్పనిసరి. ఇంకా కొందరు అయతే నిత్యం దేవాలయంకు వెళ్లి వారి శక్తిని అనుసరించి పూజలు చేస్తారు. ప్రదక్షణలు చేస్తారు. అయితే ఏరోజు ఏం పూజ చేస్తే మంచిదో తెలుసుకుందాం…
సోమవారం
సోమ అంటే చంద్రుడు. సాక్షత్తు లక్ష్మీదేవికి సహోదరుడు. ఆయన పేరుమీద వచ్చిన రోజు. ఈరోజు సంపద కావాలని కోరుకునేవారు సోమవారం లక్ష్మీదేవిని పూజించాలి.అదేవిధంగా చంద్రుడిని ధరించిన సోమేశ్వరుడు అంటే శివుడికీ ఈరోజు ప్రతికరం ఈరోజు ఆస్వామికి పూజ, అభిషేకం, ప్రదక్షణలు, ఉపవాసం చేస్తే మంచి ఫలితాలు ఇస్తాడు అని పురాణ వచనం.
మంగళవారం
ఈరోజుకు అధిపతి కుజుడు ఆయన హోరలో సూర్యోదయం అవుతుంది. ఈరోజు కుజ గ్రహారాధన, గణపతి, అంజనేయస్వామి ఆరాధన చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. సుబ్రమణ్య ఆరాధన కూడా మంచి ఫలితం ఇస్తుంది. వ్యాధులు ఉన్నవారు, రావద్దు అనుకునే వారు కూడా ఈరోజు కుజగ్రహంతోపాటు కాళీదేవతను పూజించి, కందులు దానం చేస్తే మంచిది.
బుధవారం : pooja
బుధవారం ఈరోజుకు బుధగ్రహానికి ప్రీతి అదేవిధంగా గణపతి, అయ్యప్ప, సరస్వతి దేవితోపాటు విష్ణువును పూజించాలి. ఈరోజు పెరుగు అన్నాన్ని నైవేద్యం పెడితే కుటుంబంలో అందరు ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఉంటారు.
గురువారం
గురువారం ఈరోజుకు బృహస్పతి అధిపతి. ఈరోజు గురు సంబంధం అంటే దత్తాత్రేయస్వామి, గురువులను పూజించడం ఉత్తమం. సాయిబాబా, రాఘవేంద్రస్వామి వంటి గురువుల దేవాలయాలకు వెళితే మంచిది. వారికి సంబంధించిన స్తోత్రాలు చదువుకోవాలి. దీనివల్ల జ్ఞానం, ఆయుష్షు,ఆరోగ్యం కలుగుతుంది.
శుక్రవారం
సకల శుభాలకు నెలవు, కళత్ర సంబంధమైన శుక్రుడి అధిదేవత కలిగిన రోజు. ఈరోజు లక్ష్మీదేవిని, వేంకటేశ్వరస్వామిని ఆరాదిస్తే మంచి ఫలితాలు వస్తాయి అదేవిధంగా కనకదుర్గాదేవి, కాళీ, కామాక్షీ, మీనాక్షీ దేవతల ఆరాధన మంచి ఫలితాలను ఇస్తుంది.
శనివారం
శనివారం శనిదేవుడుకు ప్రతికరమైన రోజు. ఈరోజు వేంకటేశ్వరస్వామి, ఆంజనేయస్వామితోపాటు రుద్రాది దేవతల ఆరాధన మంచిది. అపమృత్యువు నుంచి తప్పించుకోవాలనుకునేవారు హోమం చేసుకోవాలి. నవగ్రహ ప్రదక్షణలు, పేదలకు దానాలు చేయడం మంచి ఫలితాన్నిస్తుంది. అదేవిధంగా శ్రీవిష్ణు సహస్రనామాలను పారాయణం చేసుకోవడం, గోవిందనామాలు చదువుకోవడం అత్యుత్తమ ఫలితాలను ఇస్తుంది.