ఎక్కువ పూజలు చేసేవారు ఎందుకు సంతోషంగా ఉంటారు.. ఎప్పుడు పూజించాలి…!
మనలో చాలామంది ప్రతిరోజూ దేవుడికి పూజలు చేస్తుంటారు. అంతేకాదు చాలామంది నాస్తికులు కూడా ఉండే ఉంటారు. అసలు మనం దేవుడిని నమ్మడం నమ్మకపోవడం అనేది వారి వ్యక్తిగతం కాకపోతే నేను ఈరోజు మీకు చెప్పే విషయం చాలా ముఖ్యమైంది. దేవుడిని రోజు పూజించడం వలన మన జీవితం ఎలా ఉంటుంది అనే విషయం మీకు చెప్పబోతున్నాము.. ఈ రోజుల్లో చాలామంది ప్రతిరోజూ పూజలు చేస్తూ ఉంటారు. కానీ మీరు ఎప్పుడైనా గమనించారా.. మన కళ్ళ ముందు అన్నేం పుణ్యం ఎరుగని ఎంతోమంది చిన్నపిల్లలు చనిపోతూ ఉంటారు. ఎంతో మంది దైవదర్శనానికి వెళ్లి అక్కడ చనిపోతూ ఉంటారు. అంతేకాదు చాలామంది ఎవరికి ఎటువంటి హాని చెయ్యని వాళ్ళు కూడా చనిపోతూ ఉంటారు.
ఇందులో దాదాపు అందరూ దేవుడికి పూజ చేసే వాళ్లే..మనం రోజు వింటూనే ఉంటాం వైష్ణో దేవి ఆలయానికి వెళ్లి అక్కడ తుఫానుల వాళ్ళ చనిపోయారని శివుడి కోసం కైలాసం కి వెళ్లి అక్కడ చనిపోయారని అలా అయితే నిజంగా దేవుడికి పూజలు చేస్తున్న కూడా ఎందుకు చనిపోతున్నారు? ఎందుకు వీళ్ళని దేవుడు అసలు కాపాడడు.. అలాంటప్పుడు దేవుడికి పూజలు చేయాల్సిన అవసరం ఏముంది అని మనకు అనిపిస్తూ ఉంటుంది. ఎటువంటి పూజలు చేయకుండా రోజు మాంసాహారం తింటూ చెడుసావాసాలు చేస్తూ చెడు అలవాట్లు ఉన్నవాళ్లకి ఎటువంటి నష్టం జరగదు.. కానీ రోజు పూజలు చేస్తూ అందరితో మంచిగా ఉండే వాళ్లకు మాత్రం త్వరగా అనర్ధాలు జరుగుతూ ఉంటాయి.
అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అని మనలో చాలామంది చాలాసార్లు మదన పడుతూనే ఉంటారు. ఎక్కువ పూజలు చేసే వ్యక్తులు ఎప్పుడూ అసంతృప్తితోనే ఉంటారు. కానీ ఎటువంటి పూజలు చేయని వాళ్ళు మాత్రం చాలా సంతోషంగా జీవిస్తూ ఉంటారు. ఇది నిజం పూర్వజన్మలో పుణ్యం చేసిన వాడికి ఈ జన్మలో మంచి జరుగుతుంది. పాపం చేస్తే చెడు జరుగుతుంది. నీ స్నేహితుడు క్రితం జన్మలో పుణ్యాత్ముడు చాలా గొప్పవాడు కానీ ఈ జన్మలో దేవుడి పూజ చేయని కారణంగా కోటీశ్వరుడు కావలసిన వాడు లక్షాధికారి మాత్రమే అయ్యాడు.
నువ్వు క్రితం జన్మలో పాపాలు చేసావు అసలు నువ్వు ఈరోజు చనిపోవాల్సిన వాడివి కానీ నువ్వు రోజు గుడికి వెళ్లడం వలన ఆ చిన్న ముల్లు మాత్రమే గుచ్చుకుంది. ఇప్పుడు అర్థమైందా పాపపుణ్యాలు అలాగే దేవుడి పూజకి ఎంత మహత్యం ఉందో నీ జీవితం మొత్తం పూర్వజన్మ ఫలం మీద ఆధారపడి ఉంటుంది. అంతేకానీ ఎవరు చేసిన పాపాలకు దేవున్ని నిందించకూడదు కాబట్టి దేవుడిని నిందించడం మానేసి మీ ప్రస్తుత సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ భవిష్యత్తు చాలా బాగుంటుంది.