The Raja Saab Movie : మారుతీ కనిపిస్తే ఉతికేస్తాం అంటున్న ప్రభాస్ అభిమానులు..ఏంటి రాజాసాబ్ అంత దారుణమా ? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

The Raja Saab Movie : మారుతీ కనిపిస్తే ఉతికేస్తాం అంటున్న ప్రభాస్ అభిమానులు..ఏంటి రాజాసాబ్ అంత దారుణమా ?

 Authored By sudheer | The Telugu News | Updated on :9 January 2026,12:20 pm

ప్రధానాంశాలు:

  •  The Raja Saab Movie : మారుతీ కనిపిస్తే ఉతికేస్తాం అంటున్న ప్రభాస్ అభిమానులు..ఏంటి రాజాసాబ్ అంత దారుణమా ?

The Raja Saab Movie : రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, మారుతి Maruthi దర్శకత్వంలో రూపొందిన ‘ ది రాజా సాబ్ ‘ చిత్రం భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హారర్-కామెడీ జోనర్‌లో వచ్చిన ఈ సినిమాకు ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన (Mixed Talk) లభిస్తోంది. చిత్రంలో ప్రభాస్ తన వింటేజ్ కామెడీ టైమింగ్‌తో అలరించినప్పటికీ, కథలో పట్టు లేకపోవడం మరియు పాతకాలపు ట్రీట్మెంట్ ప్రేక్షకులను నిరాశపరిచాయి. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్‌లో సాగదీత సీన్లు, బలహీనమైన వీఎఫ్ఎక్స్ షాట్లు సినిమా గ్రాఫ్‌ను తగ్గించగా, క్లైమాక్స్ లోని యాక్షన్ సీక్వెన్స్ మాత్రమే కాస్త ఊరటనిచ్చాయి. ప్రభాస్ వంటి పాన్-ఇండియా స్టార్ ఇమేజ్‌కు తగ్గట్టుగా కథను మలచడంలో దర్శకుడు విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

The Raja Saab Movie మారుతీ కనిపిస్తే ఉతికేస్తాం అంటున్న ప్రభాస్ అభిమానులుఏంటి రాజాసాబ్ అంత దారుణమా

The Raja Saab Movie : మారుతీ కనిపిస్తే ఉతికేస్తాం అంటున్న ప్రభాస్ అభిమానులు..ఏంటి రాజాసాబ్ అంత దారుణమా ?

సినిమా ఫలితంపై మిక్స్‌డ్ టాక్ రావడంతో, రిలీజ్‌కు ముందు దర్శకుడు మారుతి చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో మారుతి అత్యంత ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతూ, “సినిమా నచ్చకపోతే నేరుగా నా ఇంటికే రావచ్చు” అని సవాల్ విసిరారు. అంతేకాకుండా, తన నివాస అడ్రస్ (కొండాపూర్, కొల్లా లగ్జూరియా, విల్లా నంబర్ 17) కూడా మైక్‌లో ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. తన అవుట్‌పుట్‌పై ఆయనకున్న ధైర్యానికి ఆ సమయంలో అభిమానులు ఫిదా అయ్యారు.

అయితే ఇప్పుడు సినిమా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో, ఆనాడు ఆయన చేసిన వ్యాఖ్యలే ఆయనకు ఇబ్బందికరంగా మారాయి. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా మారుతిపై విపరీతమైన ట్రోలింగ్ సాగుతోంది. “విల్లా నంబర్ 17 కి రూట్ మ్యాప్ రెడీ” అంటూ నెటిజన్లు మీమ్స్‌తో రెచ్చిపోతున్నారు.

Tags :

    sudheer

    ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది