తెలంగాణలో రాజకీయ ఎత్తుల వేయటంలో కేసీఆర్ ను మించిన నేత మరొకరు లేరని అందరు అనే మాట. ఆ మాటను నిజం చేస్తూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ సరికొత్త ఎత్తుగడ వేసి అటు ప్రతిపక్షాలనే కాకుండా ఇటు సామాన్య జనాలను సైతం షాక్ కు గురిచేశాడు.
హైదరాబాద్ – రంగారెడ్డి- మహబూబ్ నగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి తెరాస తరుపున ఎవరిని పోటీకి దించాలి అనే దానిపై కేసీఆర్ గత కొద్దీ రోజులుగా మల్లగుల్లాలు పడుతున్నాడు. ఇలాంటి స్థితిలో అనూహ్యంగా మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కూతురు సురభి వాణిదేవీని పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా ఖరారు చేయడం… పోటీకి ఆమె అంగీకరించడం తెలంగాణ రాజకీయవర్గాల్లో సంచలనం రేపుతోంది. సురభి వాణిదేవి… రాజకీయాల్లో లేరు. ఆమె విద్యాసంస్థలను నిర్వహిస్తున్నారు. అయితే పీవీ నరసింహారావుకు ఎక్కడా లేనంత గౌరవం ఇవ్వాలని నిర్ణయించిన కేసీఆర్.. శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల కమిటీలో సురభి వాణిదేవికి కీలక స్థానం ఇచ్చారు…
నిజానికి హైదరాబాద్ – రంగారెడ్డి- మహబూబ్ నగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం తెరాస కు అనుకూలమైనది కాదు. గతంలో ఉద్యమ వేడి ఉన్నప్పుడే… ఉద్యోగ సంఘాల నేత దేవీప్రసాద్ ను ఉద్యోగానికి రాజీనామా చేయించి ఎమ్మెల్సీగా పోటీ చేయించారు. కానీ అక్కడ ఓడిపోయారు. ఈ ధపా అక్కడ పోటీచేయాలని మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ను కేటీఆర్ కోరిన కానీ ఆయన సున్నితంగా తిరస్కరించాడు. గతంలో పోటీచేసి ఓడిపోయిన దేవీప్రసాద్ ను మరోసారి పోటీచేయాలని కోరితే, ఒక్కసారి ఓడించారు సరిపోలేదా..? మరోసారి నేను ఆ సాహసం చేయలేనని తేల్చి చెప్పాడు. అలాంటి స్థానంలో సురభి వాణిదేవీని నిలబెట్టటాన్ని ఏ కోణంలో చూడాలి.
పీవీ కూతురు సురభి వాణిదేవీని ఈ స్థానంలో పోటీ చేయించటాన్ని బట్టి చూస్తే ఇది ఖచ్చితంగా రాజకీయ ఎత్తుగడ అనే చెప్పాలి. అటు భాజపా, ఇటు కాంగ్రెస్ ను కార్నర్ లోకి తోయడానికి వేసిన ఎత్తుగడగా చూడాలి దీనిని. కాంగ్రెస్ పార్టీ పిఎమ్ గా పని చేసిన నాయకుడి కుమార్తె. అందువల్ల కచ్చితంగా ఆ పార్టీ కాస్త ఇరుకునపడుతుంది. ఇక భాజపా సంగతి కూడా అలాగే వుంటుంది. భాజపా అంటే ఇష్టపడే సామాజిక వర్గానికి చెందిన వాణి కి సహజంగా ఆ వర్గం నుంచి ఆదరణ వుంటుంది. అలాగే పివి అంటే వర్గాలు, పార్టీలకు అతీతంగా అభిమానించేవారు వున్నారు. పట్టణ ఓటర్లు, యువతలో కూడా పివి అంటే అభిమానించేవారు ఇప్పటికీ వున్నారు. వీరు సహజంగా భాజపా అంటే కూడా అభిమానంతో వుంటారు. వీరందరినీ డైలామాలో పడేయడం లేదా ఈ ఓట్లలో చీలిక తీసుకరావడం కేసిఆర్ ప్లాన్ కావచ్చు.
నిజానికి గత ఆగస్టులో గవర్నర్ కోటాలో మూడు స్థానాలు భర్తీ చేశారు. అప్పట్లోనే పీవీ కుమార్తె పేరును టీఆర్ఎస్ వర్గాలు విస్తృతంగా ప్రచారం చేశాయి. అయితే ఇప్పుడు అనూహ్యంగాపోటీకి నిలబెట్టారు. ఇది పీవీ అభిమానుల్ని కూడా షాక్‌కు గురి చేస్తోంది. తన రాజకీయ పబ్బం కోసం పీవీ కుటుంబాన్ని రాజకీయంగా వాడుకోవడానికి సీఎం కేసీఆర్ సిద్దమయ్యాడు అంటూ కొన్ని వర్గాల నుండి అసహనం వ్యక్తం అవుతుంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.