Raghu Rama Krishna Raju : వైసీపీలో ఒక్క రఘురామే కాదు.. మరో ఇద్దరు రెడ్లు కూడా..?
Raghu Rama Krishna Raju : ఆంధ్రప్రదేశ్ లోని అధికార పార్టీ వైఎస్సార్సీపీలో అసంతృప్తి ఒక్క నర్సాపురం ఎంపీ రఘురామరాజు Raghu Rama Krishna Raju తో పోవట్లేదు. మరో ఇద్దరు రెడ్లు కూడా అదే బాటలో నడవబోతున్నారంట. ఆ ఇద్దరు పార్లమెంట్ సభ్యులు కోస్తా ప్రాంతానికి చెందినవారని టాక్. 2019లో సాధారణ ఎన్నికలకు ముందు పార్టీలోకి వచ్చి, టికెట్ పొంది, గెలిచినవారేనని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమను పట్టించుకోవట్లేదని వాళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నామినేటెడ్ పోస్టులు, కాంట్రాక్టులు, పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో తమకు ప్రాధాన్యత ఇవ్వట్లేదని ఆగ్రహంగా ఉన్నారు. తమ సమస్యలను ఒకటీ, రెండు సార్లు సీఎం వైఎస్ జగన్ కి చెప్పినా ఉలుకూ లేదు, పలుకూ లేదని వాపోతున్నారు.
ఎవరికీ అక్కర్లేదా?..

Raghu Rama Krishna Raju With other mps are unhappy In Ysrcp
జిల్లాల్లో తమను ఎమ్మెల్యేలు గానీ రాష్ట్ర మంత్రులు గానీ పరిగణనలోకి తీసుకోవట్లేదని ఎంపీలు బాధగా చెబుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సైతం సంక్షేమ కార్యక్రమాల గురించే నిత్యం సమీక్షలు జరుపుతున్నారు తప్ప లోక్ సభ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై ఫోకస్ పెట్టట్లేదని తప్పుపడుతున్నారు. ఒక్కోసారి ఆవేశాన్ని ఆపుకోలేక ఓపెన్ గానే విమర్శలు చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే వచ్చే ఎలక్షన్ నాటికి వేరే పార్టీలోకి జంప్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. పార్టీ తరఫునా, ప్రభుత్వం తరఫునా సరైన గుర్తింపు లేకపోవటంతో కేడర్ కి ఏమీ చేయలేకపోతున్నామనే నిరాశ వాళ్లల్లో అలుముకుంది.
అతను వేరే.. : Raghu Rama Krishna Raju
వైఎస్సార్సీపీలో ఎంపీ రఘురామరాజుది ఒక ఫెయిల్యూర్ స్టోరీ. చక్కగా అధికారంలో ఉన్న పార్టీలో ఉండి ఓపికతో పనులు చేయించుకోవాల్సిందిపోయి హైకమాండ్ నే టార్గెట్ చేయటం సరికాదు. పర్సనల్ ఇగో ఫీలింగ్స్ తో రఘురామరాజు Raghu Rama Krishna Raju పూర్తిగా దారితప్పాడు. కానీ అతని బాటలోనే నడుస్తామని వార్నింగులు ఇచ్చేవారు కాస్త వెనకా ముందు ఆలోచించి నిర్ణయం తీసుకోవటం బెటర్. ఎందుకంటే ఏపీలో ఇప్పుడు గానీ మరో రెండు మూడేళ్లు గానీ తెలుగుదేశం పార్టీ పుంజుకునే సూచనలు లేవు. ఇక బీజేపీలోకి వెళితే తప్ప వాళ్లకు భవిష్యత్తు ఉండకపోవచ్చు. ఊరు మీద కోపమొచ్చి సూరు కింద కూలబడితే వాళ్ల రాజకీయ జీవితానికి అర్థమే ఉండకపోవచ్చు. అదే సమయంలో వైఎస్ జగన్ కూడా పార్టీ వ్యవహారాలకు మరింత సమయం కేటాయిస్తే బాగుంటుందనే సూచనలు సలహాలు కూడా వస్తున్నాయి.