ys vivekananda reddy : వైఎస్ జగన్ చిన్నాన్న హత్య కేసులో మరో ట్వీస్ట్…!
ys vivekananda reddy : ఆంధ్రప్రదేశ్ లో ఒక హత్య కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) సైతం ఏడాది కాలంగా కొలిక్కి తీసుకురాకపోవటం పట్ల ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అందునా నాటి ప్రతిపక్ష నేత, నేటి ప్రభుత్వాధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డిని ఎవరో మర్డర్ చేస్తే వాళ్లను ఇప్పటికీ దొరకబుచ్చుకోలేకపోవటం విస్మయం కలిగిస్తోంది. ఆ కేసే అంత కాంప్లికేటెడ్ గా ఉందా లేక దర్యాప్తు సంస్థ ఉదాసీనత ప్రదర్శిస్తోందా అనే అనుమానం ఎవరికైనా వస్తుంది. హత్య జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ, హత్య జరిగిన తర్వాత వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నా ఈ కేసులో ఇప్పటివరకూ ఒక్క కీలకమైన వ్యక్తిని గానీ, క్లూ పాయింట్ ని గానీ కనుక్కోలేకపోవటంతో నిజంగా దర్యాప్తు సంస్థల సామర్థ్యాన్ని సందేహించాల్సి వస్తోంది.
కీలక మలుపు..
వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు గురైన రోజు ఆయన ఇంటి వద్ద అనుమానాస్పద రీతిలో కొన్ని వాహనాలు తిరిగాయని అంటున్నారు. దీంతో ఒక ఇన్నోవా కారు ఓనర్ తోపాటు డ్రైవర్ పైన కూడా సీబీఐ విచారణ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆ కారులో ఎవరెవరు వచ్చారు? ఏం మేం చేశారు? అనే విషయాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. వాటిపైనే సీబీఐ ఇప్పుడు ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఇప్పటికే కొంత మంది అనుమానితులను అరెస్ట్ చేయగా వాళ్లు చెబుతున్న అంశాల ఆధారంగానే దర్యాప్తు కొనసాగుతోంది. దీన్నిబట్టి నిందితులు త్వరలో దొరికే ఛాన్స్ ఉందని భావించొచ్చు.
సవాల్ గా మారిన వైనం.. : ys vivekananda reddy
వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసు సీబీఐకే సవాల్ గా నిలుస్తోంది. అందుకే ఏడాది నుంచి విచారణ చేస్తున్నా పురోగతి కనిపించట్లేదు. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. వైఎస్ కుటుంబం ఆదినారాయణరెడ్డి అనే నాయకుడిపై అనుమానం వ్యక్తం చేస్తోంది. ఆదినారాయణరెడ్డి మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తున్నారు. తాను దోషిగా తేలితే ఏ శిక్షకైనా రెడీ అని ఛాలెంజ్ చేస్తున్నారు. వైఎస్ జగనేమో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీబీఐ దర్యాప్తు కోరి ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. ఎలాగూ ఆయన కోరినట్లు సీబీఐ దర్యాప్తు చేస్తోంది కాబట్టి తాను మాట్లాడటానికేముంది అనేది సీఎం వైఎస్ జగన్ అభిప్రాయంలా కనిపిస్తోంది. మధ్యలో వైఎస్ వివేకానందరెడ్డి బిడ్డ ఢిల్లీలోని సీబీఐ ఆఫీసుకు వెళ్లి తన తండ్రి హత్య కేసు దర్యాప్తు ఏమైందని నిలదీయటంతో ఈ మాత్రమైనా కదలిక వచ్చింది.