రఘురామ కృష్ణం రాజు కేసులో అడ్డంగా దొరికిన చంద్రబాబు ?
Chandrababu Naidu : ప్రభుత్వంపై విమర్శలు.. ఒక వర్గం వారిపై అడ్డగోలు వ్యాఖ్యల నేపథ్యంలో ఎంపీ రఘురామ కృష్ణం రాజును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెల్సిందే. ఒక ఎంపీని ఇలా అరెస్ట్ చేయడం పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దీనిని రాజకీయ కుట్ర అంటూ తెలుగు దేశం పార్టీతో పాటు ఇతర పార్టీల నాయకులు కూడా వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు తాజాగా రఘురామ కృష్ణం రాజుకు మద్దతుగా గవర్నర్ కు లేఖ రాయడంతో తన పార్టీ కాని వ్యక్తి గురించి బాబు మరీ ఇంతగా ఆందోళన.. ఆవేదన ఎందుకు వ్యక్తం చేస్తున్నాడు అంటూ వైకాపా నాయకులు కొందరు ప్రశ్నిస్తున్నారు. దీన్ని బట్టి ఇన్నాళ్లు రఘురామ వెనుక ఉండి నడిపించింది చంద్రబాబు నాయుడేనా Chandrababu Naid అంటూ ప్రశ్నిస్తున్నారు.
లేఖ రాసి చిక్కుల్లో బాబు..
ఎంపీ రఘు రామ కృష్ణం రాజును అరెస్ట్ చేసిన పోలీసులు ఆయన్ను కొట్టారంటూ చంద్రబాబు నాయుడు ఆరోపించారు. అదే సమయంలో ఆయనకు ప్రాణ హాని ఉంది… వెంటనే ఆయన్ను రక్షించాలంటూ కూడా చంద్రబాబు నాయుడు Chandrababu Naid గవర్నర్ కు లేఖ రాయడం జరిగింది. చంద్రబాబు నాయుడు మరియు తెలుగు దేశం పార్టీ నాయకులు కొందరు వైకాపా ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేస్తూ రఘురామ కృష్ణం రాజును వెనకేసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో ఈ కేసు తో తెలుగు దేశం పార్టీకి కూడా సంబంధం ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
బాబు ఆరోపణలు నిజం కాదు..
అరెస్ట్ చేసిన రఘురామ కృష్ణం రాజును పోలీసులు కొట్టారంటూ చంద్రబాబు నాయుడు Chandrababu Naid పేర్కొనడం జరిగింది. చంద్రబాబు నాయుడు Chandrababu Naid ఆరోపించినట్లుగా ఎంపీ ని పోలీసులు కొట్టలేదు అంటూ వైధ్యుల పరీక్షల్లో వెళ్లడయ్యింది. కాళ్లు కేవలం కమిలి పోయాయి తప్ప ఆయన్ను ఎవరు కొట్టలేదని క్లారిటీ ఇచ్చారు. దాంతో చంద్రబాబు నాయుడు తప్పుడు ఆరోపణలు చేశారంటూ వైకాపా నాయకులు విమర్శలు చేస్తున్నారు. పోలీసులను విమర్శించడంతో పాటు రఘురామ కృష్ణం రాజుకు మద్దతుగా మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు అడ్డంగా బుక్ అయ్యాడు. ఈ కేసులో ఆయన్ను కూడా ఏదో ఒక స్థానంలో పెట్టే అవకాశం ఉందంటూ కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో బాబు సైలెంట్ గా ఉంటే బెటర్ అంటూ తెలుగు తమ్ముళ్లు అంటున్నారు.