Rahul Dravid : ద్రవిడ్ మాటలు వింటుంటే ఇక విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ టీ20లు ఆడడం కష్టమే అనిపిస్తుంది..!
Rahul Dravid : న్యూ ఇయర్‌లో టీమిండియా మొదట టీ20లు ఆడుతుంది. శ్రీలంకతో ఇప్పటికీ రెండు టీ 20లు ఆడగా ఇందులో భారత్ ఒకటి గెలిచి ఒకటి ఆడింది. రెండో టీ20లో టీమిండియా యువ బౌలర్లు అర్షదీప్ సింగ్, శివమ్ మావి ఇద్దరూ కలిసి 6 ఓవర్లు వేయగా.. ఈ ఓవర్లలోనే శ్రీలంక 90 పరుగులు రాబట్టింది. కేవలం రెండు ఓవర్లే వేసిన అర్షదీప్ సింగ్ ఐదు నోబాల్స్ వేయడంతో పాటు. భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో అతనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి సమయంలో టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్.. తన బౌలర్లకు అండగా నిలిచాడు
ఇప్పుడు ఆడేవారంతా ఇంకా కుర్రవాళ్లేనని, అంతర్జాతీయ స్థాయిలో తొలి అడుగులు వేస్తున్నారని, ఇప్పుడే వారికి అండగా నిలబడాలని అభిప్రాయపడ్డాడు ద్రవిడ్ . ‘భారత జట్టులోని కుర్రాళ్లలో మంచి ప్రతిభ దాగి ఉంది. వాళ్లు ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నారు. మనం కొంత ఓపిక పట్టడం మంచిది. వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కోసమే ఈ టీమ్ ని రెడీ చేస్తున్నాం. గతేడాది వరల్డ్ కప్ ఆడిన టీమ్ తో పోలిస్తే జట్టు చాలా మార్పులు కనిపిస్తున్నాయి. అప్పుడు ఆడిన వారు ముగ్గురు నలుగురు మాత్రమే ఉన్నారు’ అని ద్రవిడ్ చెప్పాడు. ద్రవిడ్ కామెంట్స్ చూస్తుంటే ద్రవిడ్, విరాట్‌తో పాటు కొందరు సీనియర్స్‌ని కూడా పక్కన పెట్టి యువ క్రికెటర్స్‌తో టీంని సిద్ధం చేసేలా కనిపిస్తుంది.
Rahul Dravid : డేంజర్ బెల్స్..!!
టీ 20లలో రోహిత్, విరాట్ ప్రదర్శన పెద్దగా కనిపించడం లేదు. వరల్డ్ కప్‌లో విరాట్ కాస్త మంచి ప్రదర్శన కబరిచిన కూడా రోహిత్ పూర్తిగా తేలిపోయాడు. అతని కెప్టెన్సీ కూడా ఎవరిని పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కేవలం ఇండియా జట్టు సెమీస్ వరకు మాత్రమే వెళ్లడంతో బీసీసీఐ కూడా టీం మార్పులపై దృష్టిపెట్టినట్టు తెలుస్తుంది. హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీలో యువ జట్టు అద్భుతాలు చేస్తుందని ఆశిస్తున్నారు.రానున్న సిరీస్‌లలో కుర్రాళ్లు అద్భుతాలు చేస్తే మాత్రం రానున్న రోజులలో విరాట్, రోహిత్‌లు ఇక టీ20లలో కనిపించడం అసాధ్యంగానే కనిపిస్తుంది. ఇక ఇటీవల విరాట్ టెస్ట్ క్రికెట్ నుండి కూడా తప్పుకుంటాడని ప్రచారం జరిగింది.