Railway Recruitment : రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ నుండి నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. 4,096 అప్రెంటిస్‌ ఖాళీలు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Railway Recruitment : రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ నుండి నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. 4,096 అప్రెంటిస్‌ ఖాళీలు..!

 Authored By ramu | The Telugu News | Updated on :20 August 2024,11:00 am

ప్రధానాంశాలు:

  •  Railway Recruitment : రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ నుండి నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. 4,096 అప్రెంటిస్‌ ఖాళీలు..!

Railway Recruitment : కేంద్ర ప్ర‌భుత్వం ఎప్ప‌టిక‌ప్పుడు రైల్వేకి సంబంధించి కొత్త పోస్ట్‌లు రిలీజ్ చేస్తుండ‌డం మనం చూస్తూనే ఉన్నాం. ఢిల్లీలోని రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నార్త్ రైల్వే పరిధిలోని డివిజన్, వర్క్ షాప్ యూనిట్లలో యాక్ట్ అప్రెంటిస్ శిక్షణ కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 4,096 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నట్టు తెల‌స్తుంది.. అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబర్‌ 16 దరఖాస్తులకు చివరితేది కాగా, అభ్యర్థులు పూర్తి వివరాల కోసం https://www.rrcnr.org/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

Railway Recruitment రైల్వే ఖాళీలు..

మొత్తం యాక్ట్ అప్రెంటిస్ ఖాళీలు: 4,096 కాగా, వారి విద్యార్హత: టెన్త్ అర్హతతో పాటు సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. ఆర్ఆర్‌సీ వర్క్ షాప్‌లు: క్లస్టర్ ఢిల్లీ, క్లస్టర్ ఫిరోజ్‌పూర్, క్లస్టర్ లఖ్‌నవూ, క్లస్టర్ అంబాలా, క్లస్టర్ మొరాదాబాద్ తదిరత వర్క్‌ షాపుల్లో ఈ ఖాళీలను భర్తీ చేస్తారు. ట్రేడ్‌లు: డేటా ఎంట్రీ ఆపరేటర్, రిఫ్రిజిరేటర్ అండ్ ఏసీ మెకానిక్ ,టర్నల్, మెకానికల్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, కార్పెంటర్, ఎంఎంవీ, ఫోర్జర్ అండ్ హీట్ ట్రీటర్, వెల్డర్, మెషినిస్ట్, ట్రిమ్మర్, క్రేన్ ఆపరేటర్, స్టెనో గ్రాఫర్ తో పాటు తదితర ట్రేడుల్లో ఈ ఖాళీలున్నాయి. వయో పరిమితి వ‌చ్చే స‌రికి 16.09.2024 నాటికి 15 ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

Railway Recruitment రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ నుండి నోటిఫికేష‌న్ విడుద‌ల‌ 4096 అప్రెంటిస్‌ ఖాళీలు

Railway Recruitment : రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ నుండి నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. 4,096 అప్రెంటిస్‌ ఖాళీలు..!

ఎంపిక విధానం: టెన్త్, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు రూ.100 .ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం రైల్వేలో జాబ్ కావాల‌ని అనుకున్న వారు ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా అప్లై చేసుకోండి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది