Rain Alert : తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. ఐదు రోజులు భారీ వర్షాలు వాయుగుండం..!!
Rain Alert : రెండు తెలుగు రాష్ట్రాలలో గత కొద్దిరోజులుగా వర్షాలు దంచి కొడుతున్నాయి. కురుస్తున్న వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా ప్రాంతాలలో పరిస్థితి చాలా అద్వానంగా మారింది. భారత వాతావరణ విభాగం తాజాగా రెండు తెలుగు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఐదు రోజులు వరకు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తాయని IMD అధికారులు తెలియజేయడం జరిగింది. గోదావరి ఇంకా కృష్ణా నదులు కురుస్తున్న వర్షాలకు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. బ్యారేజీ దగ్గర 16 గేట్లను ఎత్తి… నీటిని కిందకు వదులుతున్నారు.
అందువల్ల దిగువ ప్రాంతాల్లో ప్రజలు గోదావరి ప్రవాహం పై.. అప్రమత్తంగా వ్యవహరించటం ముఖ్యం. ఇక ఆల్రెడీ తెలంగాణలో 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఉంది. దాదాపు ఈ 15 జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని IMD ముందుగానే తెలియజేసింది. హైదరాబాద్ లో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. దీంతో అక్కడి రాష్ట్ర ప్రభుత్వంలో తట్టు ప్రాంతాలలో ఉండే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే రీతిలో జిహెచ్ఎంసి అధికారులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. బంగాళాఖాతంలో ఇవ్వాలో రేపు ఏర్పడబోయే ఉపరితల ఆవర్తనం బలంగా ఉంటుందని అది అల్పపీడనం గా మారి తర్వాత వాయుగుండం గా మారే ఛాన్స్ ఉందని.. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తాయని IMD అధికారులు హెచ్చరించారు.
ఈ పరిణామంతో కోస్తా ఇంకా రాయలసీమ జిల్లాలలో చాలా చోట్ల ఐదు రోజులపాటు ఎడతెరిపి వర్షాలు పడతాయని చెప్పుకొస్తున్నారు. అంతేకాదు కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఐదు రోజులు ప్రయాణాలు చేసేవారు అప్రమత్తంగా ఉండాలని… వాహనాదారులు కూడా అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని పాత భవనాల్లో ఉండేవారు జాగ్రత్తగా ఉండాలని జాలర్లు వేటకు వెళ్లకూడదని హెచ్చరిస్తున్నారు. ఇదే సమయంలో సముద్రం దగ్గర గంటకు 50 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది బోట్లు తిరగబడేంత పెద్ద గాలులు రావచ్చు అందరూ జాగ్రత్తగా ఉండాలని భారత వాతావరణ శాఖ రెండు తెలుగు రాష్ట్రలను హెచ్చరించింది.