Rains : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ లో ఉన్నది ఏయే జిల్లాలంటే.. మీ ప్రాంతం ఉందా చెక్ చేసుకోండి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Rains : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ లో ఉన్నది ఏయే జిల్లాలంటే.. మీ ప్రాంతం ఉందా చెక్ చేసుకోండి..!

Rains  : ఇటు తెలంగాణా, అటు ఆంధ్రా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. రెండు రోజుల నుంచి వాటి ఉదృతి పెరిగింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ వర్షాలు పడుతున్నట్టు వాతావరణ శాఖ చెప్పింది. అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారి వర్షాలకు దారి తీస్తుంది. తెలుగు రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాల వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఐతే ఆబోయే రెండు రోజుల్లో కూడా రెండు రాష్ట్రాల్లో భారీ నుంచి […]

 Authored By ramu | The Telugu News | Updated on :20 July 2024,7:00 pm

ప్రధానాంశాలు:

  •  Rains : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ లో ఉన్నది ఏయే జిల్లాలంటే.. మీ ప్రాంతం ఉందా చెక్ చేసుకోండి..!

Rains  : ఇటు తెలంగాణా, అటు ఆంధ్రా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. రెండు రోజుల నుంచి వాటి ఉదృతి పెరిగింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ వర్షాలు పడుతున్నట్టు వాతావరణ శాఖ చెప్పింది. అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారి వర్షాలకు దారి తీస్తుంది. తెలుగు రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాల వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఐతే ఆబోయే రెండు రోజుల్లో కూడా రెండు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా రానున్న 24 గంటల్లో ఈ వాయుగుండం తీరం దాటే అవకాశాలు కనిపిస్తున్నాయని.. అప్పటివరకు ఇదే విధంగా వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్ లో శనివారం సాయంత్రం ఒక మోస్తారుగా వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది.

Rains  తెలంగాణా, ఆంధ్రాలో రెడ్ అలర్ట్ లోని జిల్లాలు..

తెలంగాణా, ఆంధ్రాలో పడుతున్న ఈ భారీ వర్షాల వల్ల కొన్ని ప్రంతాలకు ప్రభుత్వం రెడ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణాలో కరీమ్నగర్, జయశంకర్ భూపాల పల్లి. పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Rains తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు రెడ్ అలర్ట్ లో ఉన్నది ఏయే జిల్లాలంటే మీ ప్రాంతం ఉందా చెక్ చేసుకోండి

Rains : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ లో ఉన్నది ఏయే జిల్లాలంటే.. మీ ప్రాంతం ఉందా చెక్ చేసుకోండి..!

ఇక ఏపీ లో కూడా 3 రోజుల పాటు ఇలానే భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. ఏపీలో కృష్ణా, గుంటూరు, ఏలూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం, అల్లూరి సీతరారాజు, బాపట్ల, నద్యాల, నెల్లూరు, పార్వతీపురం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందట. అంతేకాద్ తీరం వెంట 65 గంటల కి.మీ వేగంతో గాలులు వేస్తున్నాయని ఎవరు వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు అధికారులు హెచ్చరిస్తున్నారు. ఏదైనా అత్యవసరం ఉంటే తప్ప ఎవరు ప్రజలు బయటకు రావొద్దని వాతావరణ శాఖ వెల్లడించింది. ఏపీలో వర్షాల వల్ల శనివారం స్కూల్స్ కి హాలీడే ఇచ్చిన సంగతి తెలిసిందే.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది