Mahesh Babu : జక్కన్న స్కెచ్ మాములుగా లేదు.. డూప్ లేకుండా మహేష్ బాబుతో ఫైట్ ప్లాన్..!
ప్రధానాంశాలు:
Mahesh Babu: జక్కన్న స్కెచ్ మాములుగా లేదు.. డూప్ లేకుండా మహేష్ బాబుతో ఫైట్ ప్లాన్..!
Mahesh Babu : టాలీవుడ్ Tollywood సూపర్‌స్టార్ ప్రిన్స్ మహేశ్‌బాబు Prince Mahesh babu గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరిగా ఉన్నాడు. ప్రస్తుతం రాజమౌళి SS Rajamouli సినిమాతో బిజీగా ఉన్నాడు. అయితే ఈ సినిమాకి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. అయితే పాన్ ఇండియాలో Pan India Movie కూడా మార్కెట్ లేని మహేష్ బాబు Mahesh Babu ని ఈ సినిమా కోసం ఎంచుకొని ఒకరకంగా సాహసం చేస్తున్నాడనే చెప్పాలి. ఇక ఏది ఏమైనా కూడా తన కంటెంట్ మీదున్న కాన్ఫిడెంట్ తో రాజమౌళి ఈ సినిమాని చేస్తూ ముందుకు సాగుతున్నాడు.
Mahesh Babu మహేష్ రిస్క్..
ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను ఇటీవల రీసెంట్‌గా నిర్వహించారు. ఇక వచ్చే నెల నుంచి ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబుని విపరీతంగా వాడుకోవడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో చాలావరకు సాహసోపేతమైన సన్నివేశాలైతే ఉన్నాయట. దానికోసం కొన్ని సందర్భాల్లో మహేష్ బాబుతో రియల్ స్టంట్స్ ని కూడా చేయించడానికి తను సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. స్పైడర్ Spider కోసం ఎలాంటి డూప్ లేకుండానే ఫైట్స్ చేయడం చిత్ర యూనిట్‌ను ఆశ్చర్యానికి గురిచేసిందని ప్రొడక్షన్ డిజైనర్ రుపిన్ సుచక్ మీడియాకు వెల్లడించారు. మహేశ్ చాలా డేరింగ్ స్టంట్లు చేయడం డూప్‌లకే షాకిచ్చిందని ఆయన వెల్లడించారు. మురుగదాస్ దర్వకత్వంలో రూపొందుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ స్పైడర్ కోసం ఈ సాహసానికి పూనుకోవడం గమనార్హం.
ఇప్పుడు SS Rajamouli రాజమౌళి సినిమా కోసం ప్రత్యేకమైన స్టంట్స్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో నిప్పుతో కూడిన ఫైట్ ఒకటి ఉండబోతుందట. అందులో మహేష్ బాబు కొన్ని షాట్స్ లో నిప్పుతో స్టంట్స్ చేయడానికి సిద్ధం కాబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఇప్పటివరకు మహేష్ బాబు Mahesh babu చాలా సమయాల్లో ఎక్కువగా డూప్ లను వాడి ఫైట్ సీక్వెన్స్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ సందర్భంలో ఫైర్ తో ఫైట్ అంటే ఒక రకంగా కొంతవరకు రిస్కీతో కూడినప్పటికి రాజమౌళి Rajamouli ఉన్నాడు కాబట్టి పెద్దగా ఇబ్బంది లేకుండా ఫైట్ అయితే షూట్ చేస్తాడు. కానీ ఒక రకంగా ఫైర్ లో ఫైట్ చేయాలి అంటే మాత్రం మహేష్ బాబుకు కొంతవరకు ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉందని అంటున్నారు.