Rasamayi Balakishan : ఎంత ధైర్యం.. సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీష్ లపై రసమయి సంచలన వ్యాఖ్యలు..!! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Rasamayi Balakishan : ఎంత ధైర్యం.. సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీష్ లపై రసమయి సంచలన వ్యాఖ్యలు..!!

Rasamayi Balakishan : టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి సంచలన వ్యాఖ్యలు చేశారు. చదువు విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులు కేటీఆర్ ఇంకా హరీష్ ల కంటే తానే ఎక్కువ చదువుకోవటం జరిగిందని తెలియజేశారు. తన సొంత నియోజకవర్గం మానకొండూర్ లో ఓ దళిత సభలో TRS ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా తాను పాటలు పాడి ఎమ్మెల్యే కాలేదని..! తాను డాక్టరేట్ చదువు చదవడం జరిగిందని తెలిపారు. TRS ఎమ్మెల్యే రసమయి.. సాధారణమైన […]

 Authored By sekhar | The Telugu News | Updated on :7 December 2022,1:40 pm

Rasamayi Balakishan : టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి సంచలన వ్యాఖ్యలు చేశారు. చదువు విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులు కేటీఆర్ ఇంకా హరీష్ ల కంటే తానే ఎక్కువ చదువుకోవటం జరిగిందని తెలియజేశారు. తన సొంత నియోజకవర్గం మానకొండూర్ లో ఓ దళిత సభలో TRS ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా తాను పాటలు పాడి ఎమ్మెల్యే కాలేదని..!

తాను డాక్టరేట్ చదువు చదవడం జరిగిందని తెలిపారు. TRS ఎమ్మెల్యే రసమయి.. సాధారణమైన వ్యక్తి కాదు. దళిత బిడ్డ ఎన్నో ఉన్నత చదువులు చదివాను అని తన గురించి తను గొప్పగా చెప్పుకున్నారు. దీంతో టిఆర్ఎస్ పార్టీలో కీలక నాయకులు కేసీఆర్, కేటీఆర్, హరీష్ ల కంటే తాను ఎక్కువ చదువు చదివానని ఎమ్మెల్యే రసమయి చేసిన వ్యాఖ్యలు టిఆర్ఎస్ పార్టీలో మరియు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Rasamayi Balakishan comments on kcr and ktr in harish

Rasamayi Balakishan comments on kcr and ktr in harish

నిన్న అంబేద్కర్ వర్ధంతి నేపథ్యంలో నియోజకవర్గంలో జరిగిన ఓ సమావేశంలో తనకి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆదర్శమని TRS ఎమ్మెల్యే రసమయి తెలియజేశారు. ఎటువంటి సౌకర్యాలు లేని అంబేద్కర్ పెద్ద చదువులు చదివి రాజ్యాంగం రాస్తే అలా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఉన్నత చదువులు చదివినట్లు.. పేర్కొన్నారు. దీంతో రసమయికి ఎంత ధైర్యం .. ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారో అని.. సోషల్ మీడియాలో ఈ వార్తపై నేటిజన్ లు రకరకాలుగా చర్చించుకుంటున్నారు.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది