Rashmika | ‘మగాళ్లకూ పీరియడ్స్ వస్తే బాగుండేది’ .. రష్మిక మందన్న భావోద్వేగ కామెంట్స్ వైరల్! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rashmika | ‘మగాళ్లకూ పీరియడ్స్ వస్తే బాగుండేది’ .. రష్మిక మందన్న భావోద్వేగ కామెంట్స్ వైరల్!

 Authored By sandeep | The Telugu News | Updated on :5 November 2025,2:00 pm

Rashmika | టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు తన అందం, అభినయం, చిలిపితనంతో కోట్లాది అభిమానులను సంపాదించుకున్న రష్మిక మందన్న ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అత్యంత బిజీ హీరోయిన్‌గా కొనసాగుతోంది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో వరుస ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతూ జాతీయ స్థాయిలో స్టార్‌డమ్ సొంతం చేసుకున్న ఆమెను అభిమానులు ‘నేషనల్ క్రష్’ గా పిలుస్తారు.

Rashmika Mandanna టాలీవుడ్ హీరోతోనే రష్మికా మండన్న పెళ్లి నిర్మాత కన్ఫర్మ్ చేశాడోచ్

ర‌ష్మిక స్ట‌న్నింగ్ కామెంట్స్..

ఇక రష్మిక వ్యక్తిగత జీవితంపై కూడా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు చర్చ నడుస్తూనే ఉంది. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తో ఆమె రిలేషన్‌షిప్ రూమర్స్ తరచూ హాట్ టాపిక్ అవుతున్నాయి. గీతా గోవిందం , డియర్ కామ్రేడ్ సినిమాల్లో ఈ జంట చూపిన కెమిస్ట్రీ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఇటీవల వీరిద్దరూ ఎంగేజ్ అయ్యారనే వార్తలు వచ్చినప్పటికీ, ఇద్దరూ ఈ విషయంపై ఎటువంటి రియాక్షన్ ఇవ్వకపోవడంతో ఆ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది.

ఇటీవల రష్మిక, నటుడు జగపతిబాబు హోస్ట్ చేస్తున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా’ టాక్ షోలో పాల్గొంది. తన చిన్ననాటి స్కూల్ జ్ఞాపకాలు, సరదా సంఘటనలు పంచుకుంటూ ప్రేక్షకులను పిండేసింది. అయితే షోలో ఒక ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జగపతిబాబు అడిగిన ఒక సరదా ప్రశ్నకు రష్మిక సమాధానంగా .. “మగాళ్లకు కూడా పీరియడ్స్ వస్తే బాగుండేది. అప్పుడు వాళ్లు కూడా ఆ నొప్పి, అసౌకర్యం, మూడ్ స్వింగ్స్ అన్నీ అనుభవించి మహిళల స్థితి ఎంత కష్టమో అర్థం చేసుకుంటారు అని చెప్పింది

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది