Chicken Curry Recipe : చాలా ఈజీగా రెస్టారెంట్ స్టైల్ గ్రేవీ చికెన్ చేసుకోండి ఇలా…
నాన్ వెజ్ అంటే ఇష్టపడని వారంటూ ఎవరూ ఉంటారు. అందులో ఈ చికెన్ అంటే ఇంకా చాలా మంది ఇష్టపడుతుంటారు. చికెన్ అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకూ చాలా ఇష్టపడుతుంటారు. ఇలాంటి చికెన్ ని ఎన్నో రకాల స్టైల్లో వండుతుంటారు. చికెన్ సూప్ అని, చికెన్ లాలిపాప్ ,చికెన్ 65 ,చికెన్ గ్రేవీ, చికెన్ బిర్యాని ,చికెన్ కబాబ్ ఇలా చికెన్ తో ఎన్నో రకాలుగా వండుతుంటారు.
Chicken Curry Recipe : రెస్టారెంట్ స్టైల్ లో చికెన్ గ్రేవీ కర్రీ చేయడం ఎలాగో చూద్దాం.
దీనికి కావలసిన పదార్థాలు : 1కేజీ చికెన్, పెరుగు, నిమ్మరసం ,పసుపు, కారం , అల్లం ,ఎల్లిపాయలు ,జీడిపప్పు , గరంమసాలా, ఆయిల్ కొత్తిమీర ,టమాటాలు, పచ్చిమిర్చి , కర్వేపాకు, ఉల్లిపాయలు, ఇలాచి ,బిరియాని ఆకు ,అనాసపువ్వు, లవంగాలు ,దాల్చిన చెక్క, ఫ్రెష్ క్రీమ్, కసూరి మేతి , జిలకర మొదలగినివి..

Restaurant Style Chicken Curry Recipe In Telugu
తయారీ విధానం : ఒక కేజీ చికెన్ ని బౌల్ లో తీసుకొని కొంచెం నిమ్మరసం కొంచెం ఉప్పు వేసి బాగా శుభ్రపరచుకోవాలి. తరువాత ఒక కప్పు పెరుగు, రెండు టీ స్పూన్ల కారం ,తగినంత ఉప్పు, నాలుగు స్పూన్ల ఆయిల్, అర టీ స్పూన్ పసుపు ఇవన్నీ వేసి బాగా కలపాలి. బాగా ముక్కలకు పట్టించి నైట్ మొత్తం ఫ్రిజ్ లో ఉంచుకోవాలి. తరువాత స్టౌ మీద ఒక కడాయి పెట్టుకుని దానిలో రెండు స్పూన్ల ఆయిల్, బిర్యానీ ఆకు, రెండు ఇలాచీలు ,ఒక దాల్చిన చెక్క ,ఒక అనాసపువ్వు ,వేసి లైట్ గా వేయించుకోవాలి. తర్వాత ఒక చిన్న కప్పు అల్లం ముక్కలు సన్నగా తరిగినవి ,ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు ,కొంచెం పసుపు, ఒక కప్పు టమాట ముక్కలు ఇవన్నీ మెత్త పడడానికి కొంచెం ఉప్పు వేసి పది నిమిషాల తర్వాత ఈ మిశ్రమం చల్లారిన తర్వాత దాంట్లో కొంచెం కొత్తిమీర వేసి మిక్సీ వేసుకోవాలి.
మెత్తటి పేస్టులాగా చేసుకోవాలి. తరువాత అదే కడాయిలో నాలుగు స్పూన్ల ఆయిల్, కొంచెం బటర్ వేసి తరువాత కొంచెం జిలకర, దాల్చినచెక్క, అనాసపువ్వు ,రెండు ఇలాచీలు ,ఒక లవంగం ,ఒక బిర్యాని ఆకు, కర్వేపాకు, నాలుగు పచ్చిమిర్చి చీలికలు వేసి కొద్దిసేపు ఫ్రై నివ్వాలి. తరువాత ఇంత ముందు మనం మిక్సీ వేసుకున్న ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి. తర్వాత ఒక పది నిమిషాలు మూత పెట్టి దానిలో నుంచి ఆయిల్ బయటకు వచ్చే వరకు ఉడకనివ్వాలి. తరువాత కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి. తర్వాత నైట్ మొత్తం ఫ్రిజ్లో ఉంచిన మ్యారెనెట్ చేసిన చికెన్ వేసి 20 నిమిషాలు ఉడికించాలి. చికెన్ బాగా ఉడికిన తరవాత కొంచెం వాటర్ వేసుకోవాలి. దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆపే ముందు కొంచెం ఫ్రెష్ క్రీమ్, ఒక స్పూన్ గరం మసాలా, కొంచెం కసూరి మేతి వేసి దించుకోవాలి. అంతే ఎంతో సింపుల్ గా రెస్టారెంట్ స్టైల్ లో గ్రేవీ చికెన్ రెడీ.
