Revanth Reddy : రేవంత్ రెడ్డి ఇదే ఊపు మీద ఉంటే.. 2023 లో తెలంగాణ సీఎంగా కన్ఫమ్? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Revanth Reddy : రేవంత్ రెడ్డి ఇదే ఊపు మీద ఉంటే.. 2023 లో తెలంగాణ సీఎంగా కన్ఫమ్?

Revanth reddy :  తన అభిమాన నాయకుడిని విభిన్న రూపాల్లో చూపించేందుకు ప్రయత్నిస్తుంటారు కొందరు. గతంలో అనేక మంది నేతలను రాముడు, కృష్ణుడు, అర్జునుడు రూపంలో చూపించేందుకు ప్రయత్నించారు. అందుకు తగ్గట్టుగా ఫ్లెక్సీలు, కటౌట్‌లు ఏర్పాటు చేశారు. తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి Revanth reddy  ని యముడిగా చూపిస్తూ కటౌట్ ఏర్పాటు చేశాడు ఓ కాంగ్రెస్ నాయకుడు. గజ్వేల్‌లో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన దళిత, గిరిజన దండోరా సభలో ఈ కటౌట్ అందరి దృష్టిని […]

 Authored By sukanya | The Telugu News | Updated on :18 September 2021,12:35 pm

Revanth reddy :  తన అభిమాన నాయకుడిని విభిన్న రూపాల్లో చూపించేందుకు ప్రయత్నిస్తుంటారు కొందరు. గతంలో అనేక మంది నేతలను రాముడు, కృష్ణుడు, అర్జునుడు రూపంలో చూపించేందుకు ప్రయత్నించారు. అందుకు తగ్గట్టుగా ఫ్లెక్సీలు, కటౌట్‌లు ఏర్పాటు చేశారు. తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి Revanth reddy  ని యముడిగా చూపిస్తూ కటౌట్ ఏర్పాటు చేశాడు ఓ కాంగ్రెస్ నాయకుడు. గజ్వేల్‌లో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన దళిత, గిరిజన దండోరా సభలో ఈ కటౌట్ అందరి దృష్టిని ఆకర్షించింది.

యమదొంగ సినిమాలో యముడిగా కనిపించే జూనియర్ ఎన్టీఆర్ పోస్టర్‌లో ఎన్టీఆర్ ఫేస్‌కు బదులుగా రేవంత్ రెడ్డి ముఖాన్ని పెట్టి కటౌట్ రూపొందించారు. భారీ ఎత్తున ఏర్పాటు చేసిన ఈ కటౌట్‌ను గజ్వేల్ సభా ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. కందుకూరు జడ్పీటీసీ ఏనుగు జంగారెడ్డి ఈ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. ఈ కటౌట్ కింద దొరలకు యముడు అని ముద్రించారు. ఈ కటౌట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలామంది దృష్టిని ఆకర్షిస్తోంది. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.

Anumula Revanth Reddy

Anumula Revanth Reddy

కేసీఆర్ పై విమర్శలు.. Revanth Reddy

తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన అవసరం ఉందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి Revanth reddy  గజ్వేల్‌ దళిత, గిరిజన దండోరా సభలో అన్నారు. వేలాది మంది విద్యార్థుల బలిదానాలతో ఏర్పాటైన తెలంగాణను కేసీఆర్ కుటుంబం దోచుకుంటోందని మండిపడ్డారు. తెలంగాణలోని విద్యార్థులు, నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదని.. కానీ కేసీఆర్ కుటుంబంలో నలుగురికి ఉద్యోగాలు వచ్చాయని విమర్శించారు. తెలంగాణలో 12 శాతం ఉన్న మాదిగలకు కేబినెట్‌లో స్థానం లేదని.. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే తన కుమారుడినో, అల్లుడినో కేబినెట్ నుంచి తప్పించి ఆ స్థానంలో మాదిగలకు స్థానం కల్పించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. పేదల, విద్యార్థులు, దళితుల కోసం కాంగ్రెస్ ఎంతో చేసిందని.. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తరువాత అందరినీ మోసం చేస్తున్నారని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.

కదిలిరావాలని.. Revanth Reddy

గజ్వేల్ నియోజకవర్గంలో అభివృద్ధి అంతా గీతారెడ్డి హయాంలోనే జరిగిందని అన్నారు. విద్యార్థులకు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం తీసుకొస్తే.. కేసీఆర్ దాన్ని నీరుగార్చారని అన్నారు. గొర్రెలు, బర్రెలు తమ పిల్లలకు వద్దని.. తమ పిల్లలకు చదువులు కావాలని అన్నారు. ఆరోగ్యశ్రీని పటిష్టం చేసి పేదలందరికీ ఉచితంగా రూ. 5 లక్షల వరకు చికిత్స అందించాలని డిమాండ్ చేశారు. అనేక ప్రభుత్వ పాఠశాలలను మూసేసి పేదలకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలోని కేసీఆర్‌పై పోరాడేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధం కావాలని అన్నారు.

congress party

congress party

రాష్ట్రంలోని 34708 పోలింగ్ బూత్‌లలో ఒక్కో బూత్కో సం 9 మంది కార్యకర్తలు పని చేయాలని రేవంత్ రెడ్డి కోరారు. వారిని గుండెల్లో పెట్టుకుని చూస్తామని.. వారే రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం బ్రాండ్ అంబాసిడర్లు అని అన్నారు. హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్‌లో ధర్మయుద్ధం చేద్దామని రేవంత్ రెడ్డి అన్నారు. ఇందుకు అంతా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అయితే ఈ సభ ఎప్పుడు నిర్వహించాలనే విషయాన్ని మాత్రం రేవంత్ రెడ్డి ప్రకటించలేదు.

sukanya

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది