Revanth Reddy : మరో యుద్ధం ప్రకటించిన రేవంత్ రెడ్డి… 20 రోజుల్లో పనులు కాకపోతే ఖబడ్ధార్.. రేవంత్ రెడ్డి వార్నింగ్..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Revanth Reddy : మరో యుద్ధం ప్రకటించిన రేవంత్ రెడ్డి… 20 రోజుల్లో పనులు కాకపోతే ఖబడ్ధార్.. రేవంత్ రెడ్డి వార్నింగ్..?

 Authored By jagadesh | The Telugu News | Updated on :21 April 2021,4:50 pm

Revanth Reddy : రేవంత్ రెడ్డి అంటేనే తెలంగాణ ఫైర్ బ్రాండ్. ఆయన పేరుకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా… ఆయన తెలంగాణ ప్రజల నాయకుడు. ఆయన ఒక్క పార్టీకే చెందిన నాయకుడు కాదు. ఆయన ప్రజల కోసం ఎంత దూరం అయినా వెళ్తారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల్లో దమ్మున్న నాయకుడంటే రేవంత్ రెడ్డి అనే చెప్పుకోవాలి. రేవంత్ రెడ్డి.. తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించడంలో దిట్ట. తెలంగాణలో ఏ సమస్య ఉన్నా… డైరెక్ట్ గా సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి.. ఆ సమస్యను అక్కడికక్కడే పరిష్కారం అయ్యేలా చూసే నేత రేవంత్ రెడ్డి.

revanth reddy on tribals issues in adilabad dist

revanth reddy on tribals issues in adilabad dist

1981 లో ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో జరిగిన ఘటన అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. 40 ఏళ్ల క్రితం ఇంద్రవెల్లిలో భూమి, భుక్తి, విముక్తి కోసం ఆనాడు రైతు కూలీ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఓ దుర్ఘటన జరిగింది. ఆ ఘటనలో చాలామంది ఆదివాసీలు తమ ప్రాణాలను త్యాగం చేశారు. ఈ ఘటన జరిగి 40 ఏళ్లు అయినా… ఎన్నో ప్రభుత్వాలు మారినా.. ఇప్పటి వరకు ఆ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ల ఫ్యామిలీలకు మాత్రం న్యాయం జరగలేదు. అసలు ఆ ఘటనలో ఎంతమంది అమాయకుల ప్రాణాలు పోయాయి… అనే విషయంపై ప్రభుత్వం వద్ద కూడా సరైన వివరాలు లేవు.. ఈ ఘటన జరిగి ఏప్రిల్ 20 కి 40 ఏళ్లు కావడంతో… కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి… ఇంద్రవెల్లికి వెళ్లి అక్కడి ఆదివాసీలతో మాట్లాడారు.

ఆదివాసీల పోరాటంలో ఎందరో మహనీయులు అమరులు అయ్యారు కానీ… ఇప్పటి వరకు కూడా ఆదివాసీల సమస్యలు పరిష్కారం కాలేదని రేవంత్ రెడ్డి అన్నారు. పోడు భూముల విషయంలో ఇప్పటి వరకు ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఎన్నో ప్రభుత్వాలు ఇప్పటి వరకు మారాయి కానీ… ఆదివాసీలకు కనీస సౌకర్యాలు లేవు. చివరకు ఇక్కడ మంచినీళ్లు కూడా రావడం లేదు. మిషన్ భగీరథ నీళ్లు అన్ని చోట్ల ఇస్తున్నాం అని ఓవైపు సీఎం కేసీఆర్ చెబుతున్నారు కానీ… ఇక్కడ చూస్తే మాత్రం చుట్టుపక్కన ఏ గూడాలలో కూడా మంచి నీళ్లు రావడం లేదు. పోడు భూములకు సంబంధించిన సమస్యలను ఇప్పటి వరకు తీర్చలేదు. ఆదివాసీలు దున్నుకుంటున్న భూమికి పట్టా ఇవ్వాలంటూ దశాబ్దాల నుంచి పోరు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. ఆదివాసీలకు ఇండ్లు లేవు.. ఎటువంటి సౌకర్యాలు లేవు.. అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

Revanth Reddy : అధికారంలోకి వచ్చి 7 ఏళ్లు దాటినా… ఆదివాసీల సమస్యలు పట్టవా?

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం… తెలంగాణలోని ఆదివాసీల సమస్యలను తీర్చడానికి మాత్రం వెనకడుగు వేస్తోంది. ఇంద్రవెల్లిలో కనీసం మంచినీళ్లను కూడా ప్రభుత్వం అందించడం లేదు. వెంటనే అధికారుకు ఫోన్ చేశాను. 20 రోజుల్లో ఇంద్రవెల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రజలకు కావాల్సిన సౌకర్యాలను అందించకపోతే… నేను మరో 20 రోజుల తర్వాత నేను ఇక్కడికి వచ్చి అధికారుల, ప్రభుత్వం మెడలు వచ్చి పని చేపిస్తా. మే 15 వరకు నేను ప్రభుత్వానికి సమయం ఇస్తున్నా. ఇక్కడ మంచినీటి సమస్యను లేకుండా చేయాలె. అధికారులు వెంటనే పనులు ప్రారంభించాలి. పోడు భూములకు సంబంధించిన సమస్యను కూడా వెంటనే పరిష్కరించాలి. లేదంటే.. నేను మళ్లీ మే 15 తర్వాత ఇక్కడికి వచ్చి… ఇక్కడే ఉంటా… వారం పాటు ఇక్కడే ఉండి… ప్రభుత్వంతో పని చేయిస్తా… అని ఆదివాసీలకు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

https://www.youtube.com/watch?v=_3yYprJ2FWE

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది