War 2 | వార్2లోని ఆ సీన్స్‌పై రామ్ గోపాల్ వర్మ ఫైర్.. ఆ మాత్రం తెలియదా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ , హృతిక్ రోషన్ మల్టీస్టారర్‌గా యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంతో అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ వార్ 2 ’ చిత్రం ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం విదితమే.. తెలుగులో ఈ చిత్ర హక్కులను కొన్న సూర్యదేవర నాగవంశీ నిండా మునిగిపోయారు. ఒక్క తెలుగులోనే ఈ మూవీకి సుమారు రూ.40 కోట్ల వరకు నష్టాలు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

#image_title
వర్మ క్లాస్..
‘వార్ 2’ రిజల్ట్ తర్వాత నాగవంశీ బయట ఎక్కడా కనిపించడం లేదు. డిప్రెషన్‌తో ఆయన దుబాయికి వెళ్లిపోయారని కొందరు అంటున్నారు. ‘వార్ 2’ ఫలితంపై చర్చ జరుగుతున్న వేళ వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తాజాగా స్పందించారు. ఈ చిత్రంలో కొన్ని అనవసర సీన్లు పెట్టారని.. వాటివల్లే సినిమా చచ్చిపోయిందన్నారు ఆర్జీవీ. ‘హృతిక్ రోషన్ ఎంట్రీ సీన్‌లో జపాన్ వాళ్లతో ఫైట్ చేస్తాడు. అసలు ఆ సీన్ దర్శకుడు ఎందుకు పెట్టాడో ఆయనకైనా అర్థమైందో లేదో. ఇదే విషయాన్ని నేను ఆ సినిమాకి చెందిన ఓ వ్యక్తిని అడిగితే జపాన్ వాళ్లతో ఫైట్ అంటే కొత్తగా ఉంటుందని ట్రై చేశామని చెప్పాడు.
అది విని నాకు మైండ్ బ్లాంక్ అయింది. స్పై యూనివర్స్ చిత్రాలంతే ఇండియాకు శత్రు దేశాలతో పోరాడాలి. కానీ జపాన్ మనకు మిత్రదేశం. అలాంటి దేశానికి చెందిన వారితో ఎలా ఫైట్ చేస్తారు. ఈ లాజిక్ తెలుసుకోకపోవడంతో సినిమాని ప్రేక్షకులు తిరస్కరించారు. ఈ ఒక్క సీనే కాదు ఆ సినిమాలో అలాంటి చెత్త సీన్లు చాలానే ఉన్నాయి. హీరోల ఎలివేషన్ కోసం సీన్లు క్రియేట్ చేస్తే రిజల్ట్ ఇలాగే ఉంటంది. హీరోని పైకి లేపాలన్న ఆలోచనతో కథని చంపేస్తున్నామన్న విషయాన్ని దర్శకులు ఆలోచించడం లేదు అని వర్మ అన్నారు.