Coolie vs War 2 | ఇండియన్ బాక్సాఫీస్‌ వద్ద ‘కూలీ’ vs ‘వార్ 2’.. మొదట్లో హంగామా, తర్వాత మాత్రం నిరాశే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Coolie vs War 2 | ఇండియన్ బాక్సాఫీస్‌ వద్ద ‘కూలీ’ vs ‘వార్ 2’.. మొదట్లో హంగామా, తర్వాత మాత్రం నిరాశే..!

 Authored By sandeep | The Telugu News | Updated on :19 August 2025,1:00 pm

Coolie vs War 2 | ఇటీవలి కాలంలో ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన ‘కూలీ’ మరియు బాలీవుడ్ స్టార్స్ హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటించిన ‘వార్ 2’ రెండూ ఒకే రోజు విడుదల కావడంతో బాక్సాఫీస్ దగ్గర భారీ క్లాష్ జరిగింది.

#image_title

డ్రాప్ అవుతున్న వ‌సూళ్లు..

విడుదలైన తర్వాత రెండు సినిమాలకూ మిక్స్‌డ్ టాక్ రావడం మాత్రం అభిమానులకు నిరాశ కలిగించింది. ఈ ప్రభావం కలెక్షన్లపై స్పష్టంగా కనిపించింది. తొలి వారం చివరినాటికి ‘వార్ 2’ కంటే ‘కూలీ’ ముందంజలో ఉంది. ‘కూలీ’ వసూళ్లు.. 4 రోజుల్లో వరల్డ్ వైడ్ గ్రాస్‌: రూ.404 కోట్లు కాగా , సోమవారం ఇండియాలో నెట్ వసూళ్లు: రూ.12 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో గ్రాస్: రూ.50 కోట్లు, తెలుగు రైట్స్ కొనుగోలు చేసిన సంస్థ: ఏషియన్ మల్టీప్లెక్సెస్ (రూ.53 కోట్లు).. బ్రేక్ ఈవెన్ టార్గెట్: రూ.108 కోట్ల గ్రాస్ / రూ.54 కోట్ల షేర్ రాబ‌ట్టింది.

‘వార్ 2’ వసూళ్లు చూస్తే.. 4 రోజుల్లో వరల్డ్ వైడ్ గ్రాస్‌: రూ.270 కోట్లు, సోమవారం ఇండియాలో నెట్ వసూళ్లు: రూ.6.5 కోట్లు, తెలుగు రైట్స్ నాగవంశీ కొనుగోలు చేయగా, థియేట్రికల్ బిజినెస్ (తెలుగులో): రూ.87.5 కోట్లు, బ్రేక్ ఈవెన్ టార్గెట్: రూ.88 కోట్ల నెట్ వసూలు చేసింది. ఇప్పటివరకు సగం కూడా రాలేదని ట్రేడ్ అనలిస్ట్‌ల అంచనా . వీకెండ్‌లో ఆశాజనకంగా ఆరంభించినా, వర్కింగ్ డేస్‌లో సినిమాల వసూళ్లు బాగా పడిపోయాయి. ఇది ట్రేడ్ వర్గాలను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది.‘కూలీ’ మాత్రం ఓ మోస్త‌రు నెట్టుకొస్తుండ‌గా, ‘వార్ 2’ పూర్తిగా వెనకబడింది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది