Rising Sea Level : 2040 నాటికి ముంబై మునిగిపోతుందా.. చెన్నై కూడానా.. షాక్ ఇస్తున్న CSTEP అధ్యయనం..!
Rising Sea Level : వరల్డ్ వైడ్ గా కాలుష్యం రోజు రోజుకీ ఎక్కువ అవుతుంది. భారీగా వాయు కాలుష్యం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ టైం లో వాతావరణంలో వచ్చే మార్పులు తీవ్ర పరిణామా లకు దారి తీస్తున్నాయి.. వాతావరణం కాలుష్యం వల్ల దృవాల వద్ద మంచు బాగా కరగుతుంది.. వీటితో పాటు సముద్ర మట్టాల యొక్క స్థాయి కూడా ఊహించని విధంగా పెరుగుతున్నాయి. దాని వల్ల ఎన్నో విపత్తులు సంభవించే అవకాశం ఉంది. సముద్ర తీరాల ప్రాంతాలు ఇప్పటికే కొద్దికొద్దిగా కనుమరుగైపోతున్నాయి అని శాస్త్రవేత్తలు, పర్యావరణవేత్తలూ చెబుతున్నారు. పర్యావరణ వేత్తలచెబుతున్న సూచనలు ఇంకా శాస్త్రవేత్తల హెచ్చరికలను బట్టి చూస్తే రాబోయే రోజుల్లో చాలా పెద్ద ప్రమదం రాబోతుందని అనిపిస్తుంది. అయితే ఈ హెచ్చరికలు ఎక్కువ మంది ప్రజలు పరిగణలోకి తీసుకోవడంలేదనే చెప్పాలి. ప్రకృతి విలయ తాండవానికి కూడా ఈ కాలుష్యం ఒక కారణం అని వాటికి వాతావరణంలో జరుగుతున్న మార్పులే మూలాలని అంటుంటారు. అయితే ఈ టైమ్ లో బెంగళూరు లో ఉన్న సెంటర్ ఫర్ స్టడీ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ పాలసీ (CSTEP) సంస్థ కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడించింది.
Rising Sea Level : 2040 నాటికి 10శాతం ముంబై మునిగిపోతుందా..
1987-2021 మధ్య పెరిగిన సముద్రమట్టాల స్థాయిని చూస్తే ఫ్యూచర్ లో ముంబై, చెన్నై, ఇంకా తిరువనంతపురం, మంగుళూరు, అటు కోచి, కన్యాకుమారి, ఉడిపి, కోజికోట్తుత్తుకుడి, పూరి, ఫనాజీ, హల్దియాలో ఈ సంస్థ అధ్యయనాలు చేపట్టి షాకింగ్ న్యూస్ చెప్పింది. 3 ఏళ్ల క్రితం అంటే 2021 వరకూ ఈ నగరాల్లో సముద్రమట్టాలు ఏ స్థాయిలో పెరిగాయనేది సీ.ఎస్.టీ.ఈ.పీ ఒక నివేదిక ఇచ్చింది. ఇది చూస్తే హల్దియా (2.72 సెం.మీ), విశాఖపట్నం (2.38 సెం.మీ), ముంబై (4.44 సెంటీ మీటర్లు), కొచీ (2.21 సెం.మీ) లెక్కన సముద్రమట్టాల స్థాయి అత్యధికంగా బాగా పెరిగిందని తెలిపింది. ఇలా చూస్తే చూసుకుంటే… 2040 నాటికి భారతదేశ ఆర్థిక రాజధాని అయిన ముంబై 10% పైగా మునిగిపోనుందని షాకింగ్ విషయాన్ని వెల్లడించింది.
ఇదే వరుసలో టూరిజం కేపిటల్ గా చెప్పుకునే గోవా లో కూడా ఈ ఎఫెక్ట్ ఉంటుంది. గోవా రాజధాని పణాజీలో కూడా పెరుగుతున్న సముద్రమట్టం కారణంగా 10% భూభాగం దాదాపుగా మునిగిపోయే అవకాశం ఉందని అంటున్నారు. వీటితో పాటే యానం, తుత్తుకూడిలో కూడా 10% వరకు ఆ ప్రాంత భూభాగం కనుమరుగయ్యే అవకాశాలున్నాయని సీ.ఎస్.టీ.ఈ.పీ తన తాజా అధ్యయనంలో పేర్కొంది. సౌత్ లో ఈ ఎఫెక్ట్ చెన్నైకి 5 – 10% ఉంటుందని తెలిపింది. ఏపీలో ఆర్థిక రాజధానిగా చెబుతున్న విశాఖపట్నంలో కూడా 1 నుంచి 5 % వరకూ భూభాగాన్ని కోల్పోనున్నాయని హెచ్చరించింది.