Rohit Sharma : రోహిత్ శర్మకి ఏమైంది.. ముక్కులో నుండి రక్తం కారుతుండడంతో ఆందోళన చెందిన ఫ్యాన్స్
Rohit Sharma: మరి కొద్ది రోజులలో వరల్డ్‌కప్ మొదలు కానుండగా, ఆటగాళ్లు గాయాల బారిన పడుతుండడం ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికే బుమ్రా , జడేజాలు పలు కారణాల వలన వరల్డ్ కప్ ( World Cup ) కి దూరమయ్యారు. ఇక తాజాగా జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ ముక్కు నుండి రక్తం కారడంతో అందరు ఆందోళన చెందారు. సౌతాఫ్రికా ( South Africa )బ్యాటింగ్ చేస్తున్న సమయంలో రోహిత్ శర్మ దగ్గరకు వచ్చిన వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ కర్చీఫ్ ఇచ్చాడు. దాంతో ముక్కు తుడుచుకున్నాడు రోహిత్ శర్మ.ఆ సమయంలోనే రోహిత్ టీషర్ట్ పై రక్తం మరకలు కూడా కనిపించాయి. దీంతో అందరు ఆందోళన చెందారు.
అయితే ముక్కు తూడ్చుకుంటూనే రోహిత్ శర్మ.. హర్షల్ పటేల్‌కి సూచనలు చేయడం లైవ్ లో కనిపించింది. ముక్కు నుంచి రక్తం కారడం ఆగకపోవడంతోనే కెప్టెన్ మైదానం నుంచి బయటికి వెళ్లారని తెలుస్తోంది. ముక్కుకి చికిత్స తీసుకున్న తర్వాత తిరిగి గ్రౌండ్ లోకి వచ్చాడు రోహిత్ శర్మ.ఈ ఘటన కి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో అందరు ఆందోళన చెందారు. ఏమైందంటూ సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అయితే డీహైడ్రేషన్ వల్లే రోహిత్ శర్మ ముక్కు నుంచి రక్తం కారిందని వైద్యులు చెబుతున్నారు. అయినా క్రికెట్ అభిమానుల్లో మాత్రం ఆందోళన తగ్గడం లేదు. బ్యాటింగ్ సమయంలోనూ రోహిత్ శర్మ గాయపడ్డాడు.
Rohit Sharma: ఆందోళన…
దక్షిణాఫ్రికా పేసర్ పార్నెల్ వేసిన రెండో ఓవర్‌లో రోహిత్ మణికట్టుకు గాయమైంది. పార్నెల్ వేసిన మూడో బంతిని రోహిత్ స్కూప్ షాట్‌తో ఫోర్ కొట్టే ప్రయత్రం చేయగా, గ్లౌవ్స్ తాకి బౌండరీకి వెళ్లింది. ఆ సమయంలో రొహిత్ విలవిలలాడిపోయాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 237 పరుగుల భారీ స్కోర్ చేసింది. సూర్యకుమార్ యాదవ్ 22 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సులతో 61 పరుగులు చేసి అదరగొట్టాడు. ఓపెనర్ కేఎల్ రాహుల్(57), కెప్టెన్ రోహిత్ శర్మ(43, విరాట్ కోహ్లీ(49 నాటౌట్), దినేష్ కార్తీక్(7 బంతుల్లో 17 నాటౌట్) రాణించడంతో భారత్ భారీ స్కోర్ సాధించింది. అయితే ఈ స్కోర్‌ని సౌతాఫ్రికా చేదించలేకపోవడంతో ఓటమి పాలైంది.