Roja : రోజాపై ప్ర‌తిపక్షాల విమ‌ర్శ‌లు.. జ‌బ‌ర్ధ‌స్త్‌తో ల‌క్ష‌లు సంపాదించానంటూ కామెంట్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Roja : రోజాపై ప్ర‌తిపక్షాల విమ‌ర్శ‌లు.. జ‌బ‌ర్ధ‌స్త్‌తో ల‌క్ష‌లు సంపాదించానంటూ కామెంట్

 Authored By sandeep | The Telugu News | Updated on :8 August 2022,7:40 pm

Roja : న‌టిగా, ఎమ్మేల్యేగా, మంత్రిగా రోజా గ్రాఫ్ పెరుగుతూ పోతుంది. కెరీర్‌లో ఉన్న‌త స్థాయికి చేరుకున్న రోజా ప్ర‌స్తుతం రాజ‌కీయాల‌లో ఉండ‌డంతో ప‌లువురి నుండి విమ‌ర్శ‌లు పొందుతుంది. రోజా ఒక‌ప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. స్టార్ హీరోలతో సమానంగా ఆడి పాడి అలరించిన ఈ బ్యూటీ..రెమ్యూనరేషన్ కూడా అదే రేంజ్ లో తీసుకుంది. అప్పట్లో రోజా సినిమాలు వస్తున్నాయి అంటే ధియేటర్స్ దగ్గర రచ్చ మాములుగా ఉండదు. టాలీవుడ్ కి బడా బడా బ్లాక్ బస్టర్స్ సినిమాలను అందించింది రోజా.

Roja : రోజా ర‌చ్చ‌..

ఇక పెళ్లి త‌ర్వాత సినిమాలు కాస్త త‌గ్గించిన రోజా సుధీర్ఘకాలం జబర్థస్త్ జడ్జిగా వ్యవహరించింది. మధ్యలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా జబర్థస్త్ ను వీడలేదు. చివరకు తనతో పాటు ఉన్న కోస్టార్ నాగబాబు వెళ్లిపోయినా.. రోజా మాత్రం జబర్థస్త్ ను వీడలేదు. దాదాపు 10 ఏళ్లు జబర్థస్త్ జడ్జిగా లక్షల్లో రెమ్యూనరేష్ తీసుకుంది రోజా.ఇటీవల తాను కొత్త కారు కొంటే టీడీపీ నేతలు ‘రుషికొండ గిఫ్ట్’ అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఏపీ మంత్రి రోజా మండిపడ్డారు. ఈ రోజుల్లో మామూలు యాంకర్లు, చిన్న నటులు సైతం కారు కొంటున్నారని ఆమె అన్నారు.

roja reveals about her property

roja reveals about her property

అయితే ఇంత పెద్ద స్థాయిలో ఉన్న నేను కారు కొనడం తప్పన్నట్టుగా టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కారు కొనాలంటే లోన్ తీసుకుంటే సరిపోతుందని, తాను కారు కొనడం గొప్పేమీ కాదని అన్నారు. తన కొత్త కారు విషయంలో ఎందుకంత రాద్ధాంతం చేస్తున్నారని ప్రశ్నించారు. చదువురాని వారికి కూడా తాను సమాధానం చెప్పాల్సిన అవసరంలేదని, తాను జబర్దస్త్ కార్యక్రమానికి ఎంత పారితోషికం తీసుకున్నదీ బ్యాంకు ఖాతా లావాదేవీలు పరిశీలిస్తే అర్థమవుతుందని రోజా వ్యాఖ్యానించారు. ఈ రకంగా జబర్థస్త్ ద్వారా రోజా ఎంత వెనకేసుకున్నారో అని నెటిజన్లు చెవులు కొరుకుంటున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది