YS Jagan : జగన్ మీద రెచ్చిపోయిన 24 గంటల్లో డీఎల్ రవీంద్రా రెడ్డికి భారీ షాక్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

YS Jagan : జగన్ మీద రెచ్చిపోయిన 24 గంటల్లో డీఎల్ రవీంద్రా రెడ్డికి భారీ షాక్..!

YS Jagan : టీడీపీ అధినేత చంద్రబాబుకు అసలు ఏ అంశంపై క్లారిటీ ఉందో చెప్పాలంటూ ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి సవాల్ విసిరారు. ఏపీలో పార్టీ పెట్టుకొని.. తెలంగాణకు వెళ్లి అక్కడ చంద్రబాబు రాజకీయాలపై వ్యాఖ్యలు చేయడం ఏంటి.. అసలు చంద్రబాబు ఏ రాష్ట్రంలో ఉన్నారో కూడా తెలియదా? తన పార్టీకి కేవలం డిమాండ్ క్రియేట్ చేసుకునే పనిలోనే చంద్రబాబు ఉన్నారంటూ సజ్జల ఎద్దేవా చేశారు. అలాగే.. డీఎల్ రవీంద్రారెడ్డి […]

 Authored By kranthi | The Telugu News | Updated on :24 December 2022,11:20 am

YS Jagan : టీడీపీ అధినేత చంద్రబాబుకు అసలు ఏ అంశంపై క్లారిటీ ఉందో చెప్పాలంటూ ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి సవాల్ విసిరారు. ఏపీలో పార్టీ పెట్టుకొని.. తెలంగాణకు వెళ్లి అక్కడ చంద్రబాబు రాజకీయాలపై వ్యాఖ్యలు చేయడం ఏంటి.. అసలు చంద్రబాబు ఏ రాష్ట్రంలో ఉన్నారో కూడా తెలియదా? తన పార్టీకి కేవలం డిమాండ్ క్రియేట్ చేసుకునే పనిలోనే చంద్రబాబు ఉన్నారంటూ సజ్జల ఎద్దేవా చేశారు. అలాగే.. డీఎల్ రవీంద్రారెడ్డి వైసీపీ పార్టీలోనే ఉన్నట్టుగా తాము భావించడం లేదని సజ్జల చెప్పుకొచ్చారు. కేంద్రం నుంచి కూడా తమకు కాపుల రిజర్వేషన్ పై ఎలాంటి క్లారిటీ రాలేదన్నారు.

బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు వెంపర్లాడుతున్నారని.. అసలు గత ఎన్నికల్లోనే రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేస్తానని చంద్రబాబు మాట ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా సజ్జల గుర్తు చేశారు. కేంద్రంలో చక్రం తిప్పుతా అన్నారు.. ఇంకేదో చేస్తా అని బీరాలు పలకడం తప్పితే.. చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు. రాజకీయాలంటే చంద్రబాబుకు ఒక ఆటలా ఉందన్నారు. కేవలం టీడీపీతో పొత్తు పెట్టుకుంటే బీజేపీకి మేలు జరుగుతుందని చంద్రబాబు చెప్పడం కోసం చేసే ప్రయత్నమే ఇది అంటూ సజ్జల గుర్తు చేశారు. అయితే.. అసలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోనే చంద్రబాబు స్లీపర్ సెల్స్ ఉన్నాయని సజ్జల ఈసందర్భంగా చెప్పుకొచ్చారు.

sajjala ramakrishna reddy about chandrababu strategy in telangana elections

sajjala ramakrishna reddy about chandrababu strategy in telangana elections

YS Jagan : తెలంగాణ కాంగ్రెస్ లో చంద్రబాబు స్లీపర్ సెల్స్

అసలు బీజేపీలోకి తన పార్టీ నుంచి పంపించి.. అక్కడ స్లీపర్ సెల్స్ గా మెయిన్ టెన్ చేస్తున్న వాళ్లను ఎందుకు తన పార్టీలోకి తిరిగి ఆహ్వానించడం లేదు. తెలంగాణ విడిపోకముందే… ఆయనది రెండు కళ్ల సిద్ధాంతం. ఒక రోజు ఒక మాట.. ఇంకోరోజు ఇంకో మాట.. ఇలాంటి వ్యక్తికి ఎలాంటి వాల్యూ ఉండదు. అసలు.. చంద్రబాబు ఆధార్ కార్డు, ఓటర్ కార్డు ఉన్నదే తెలంగాణలో. కేవలం ఎన్నికల సమయంలో తెలంగాణకు వెళ్లి తనకు ఇష్టం ఉన్నట్టుగా అక్కడి ప్రజలతో చంద్రబాబు ఆటలు ఆడుకుంటున్నారు అంటూ సజ్జల రామకృష్ణా రెడ్డి చెప్పుకొచ్చారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది