School Holidays : విద్యా సంస్థల సెలవులు మరోసారి పొడిగింపు.. నేడు ప్రకటన..?
School Holidays : తెలంగాణలో కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యా సంస్థలకు సెలవులను మరికొన్ని రోజులు పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేపటితో విద్యా సంస్థలకు సెలవులు ముగుస్తుండటంతో… వాటిని పున ప్రారంభిస్తారా లేక మళ్ళీ సెలవులను పొడిగిస్తారా అనే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే దీనిపై నేడు తెలంగాణ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా వెలుగు చూడటంతో ఈ నెల మొదటి వారంలోనే సంక్రాంతి సందర్భంగా నిర్ణయించిన సెలవులను మూడు రోజులు ముందుకు జరిపి 8వ తేదీ నుంచే ప్రభుత్వం విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ముందుగా ఆయా సెలవులు 16 వరకు ఉండగా 17 నుంచి విద్యా సంస్థలు తెరవాల్సి ఉన్నా… కేసులు తగ్గుముఖం పట్టక పోవడంతో ఈ నెల చివరి వరకు ఆ సెలవులను పొడిగించారు.

School Holidays Once again an extension
తాజాగా కేసుల విజృంభణ ఆగక పోవడంతో విద్యార్థుల సంక్షేమం దృష్ట్యం మరికొద్ది రోజులు సెలవులు పొడిగించాలనే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక చదువులకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఆన్ లైన్ తరగుతులను కొనసాగించాలనే నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం.