Kalvakuntla Kavitha : కవితని అరస్ట్ చేయడం కోసమే డిల్లీ లిక్కర్ స్కాం లో డిల్లీ cm పేరు పెట్టారా?
Kalvakuntla Kavitha : ప్రస్తుతం దేశమంతా ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించే చర్చించుకుంటోంది. ఈ స్కామ్ లో తెలంగాణకు చెందిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు కూడా అందులో చక్కర్లు కొడుతోంది. ఈ కేసుకి సంబంధించి ఇప్పటికే ఆమెను సీబీఐ అధికారులు విచారించారు. తాజాగా ఈ కేసుపై సెకండ్ చార్జ్ షీట్ ను సీబీఐ అధికారులు దాఖలు చేశారు. అందులో మరోసారి కల్వకుంట్ల కవిత పేరును చేర్చారు. ఆమెతో పాటు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ పేరు కూడా అందులో ఉంది.
వైసీపీ ఎంపీ మాగుంట పేరు కూడా అందులో ఉంది. కేవలం రాజకీయ కక్షతోనే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తమ పేర్లను చేర్చారని కేంద్ర ప్రభుత్వంపై పలువురు ఆరోపించిన విషయం తెలిసిందే. ఏది ఏమైనా ఇప్పుడు చార్జ్ షీట్ లో వాళ్ల పేరు చేర్చడం వల్ల తమకు, ఈ స్కామ్ కు ఎలాంటి సంబంధం లేదని వాళ్లు నిరూపించుకోవాలి. ఇప్పటికే తన పేరును చేర్చడంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ స్పందించారు. ఇలాంటి తాటాకు చప్పట్లకు తాము భయపడేవాళ్లం కాదని ఆయన స్పష్టం చేశారు. అరవింద్ కేజ్రివాల్ ఈ స్కామ్ పై చాలా స్పష్టంగా ఉన్నట్టు తెలుస్తోంది.
Kalvakuntla Kavitha : తాటాకు చప్పట్లకు భయపడేవాళ్లం కాదు
కేంద్ర ప్రభుత్వం ఎలా తమను ఇబ్బంది పెట్టాలని చూసినా తాము భయపడేది లేదని.. తాము నిజాయితీగా ప్రజల కోసం పనిచేస్తున్నామని.. వీళ్ల కుయుక్తులు తన ముందు కాదని ఆయన మీడియా ముఖంగా బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇక.. ఈ చార్జ్ షీట్ లో తన పేరు చేర్చడంపై ఇంకా కల్వకుంట్ల కవిత ఎలాంటి స్పందన తెలియజేయలేదు. చూద్దాం.. తను ఎలా స్పందిస్తారో. ఈ స్కామ్ లో సీబీఐ విచారణకు రెండో సారి హాజరు అవుతారా? లేక ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.