Kalvakuntla Kavitha : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ నిరాకరణ… తప్పని నిరాశ..!
ప్రధానాంశాలు:
Kalvakuntla Kavitha : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ నిరాకరణ... తప్పని నిరాశ..!
Kalvakuntla Kavitha : కల్వకుంట్ల కవితకు దక్కని ఊరట.. తీహార్ జైలులోనే
Kalvakuntla Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు రోజుకొక మలుపు తిరుగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ కేసులో కవితని కొద్ది రోజుల కిందట అరెస్ట్ చేయగా, ఆమె జ్యుడీషియల్ రిమాండ్ ఖైదీగా తీహార్ జైలులో ఈడీ విచారణ ఎదుర్కొంటుంది. అయితే కవితని విచారించేందుకు సీబీఐ కూడా రంగంలోకి దిగింది. అయితే కవిత బెయిల్‌పై బయటకు వచ్చేందుకు ఎంతగానో ప్రయత్నిస్తుంది. ఏప్రిల్ 4న కవిత బెయిల్ పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. పీఎంఎల్ఏ సెక్షన్ 45 ప్రకారం.. మహిళగా, ఎమ్మెల్సీగా ఉన్నందున.. ముఖ్యంగా తన చిన్న కుమారుడుకి 11వ తరగతి పరీక్షలు ఉన్నందున ఏప్రిల్ 16 వరకూ మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత కోరారు. ఈ మధ్యంతర బెయిల్‌ను ఈడీ వ్యతిరేఖించింది
Kalvakuntla Kavitha కేసీఆర్ కూతురికి ఇది పెద్ద షాకే..
ఇక రౌస్ అవెన్యూ కోర్టు కూడా కవితకి మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో కవితతో పాటు ఆమె అభిమానులకి పెద్ద షాక్ తగిలినట్టు అయింది. కవితకు బెయిల్ ఇస్తే లిక్కర్ కేసు దర్యాప్తుపై ప్రభావం పడుతుందని, సాక్ష్యులను, ఆధారాలను తారుమారు చేసే అవకాశం ఉందని ఈడీ కోర్టుకి వివరించడంతో వారు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించినట్టు సమాచారం. మరోవైపు కవిత అప్రూవర్‌గా మారిన కొందరిని బెదిరించారని అందుకు ఆధారాలు ఉన్నాయని కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ కొట్టివేయాలని కోర్టును ఈడీ కోరింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ మనిలాండరింగ్ కేసులో మార్చి 15న కవిత అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైలులో కవిత ఉన్నారు. రేపటితో కవిత జ్యుడీషియల్ కస్టడీ ముగియనుంది. అయితే ఈ రోజు బెయిల్ కాని క్రమంలో కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగించనున్నారు..ఇక కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై ఏప్రిల్ 20న రౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరుపనుంది. ఇక ఇదిలా ఉంటే ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత పేరును నిందితురాలిగా ఛార్జిషీట్లో సీబీఐ చేర్చింది. ఈ మేరకు నిందితురాలిగా పేర్కొంటూ 41A కింద సమన్లు పంపింది. ఇటీవల లిక్కర్ స్కాం కేసులో ఫిబ్రవరి 26న ఢిల్లీలోని తమ కార్యాలయానికి విచారణకు రావాలని సీబీఐ కవితకు నోటీసులు పంపించినప్పటికీ, కవిత విచారణకు హాజరుకాకపోవడంతో జైల్లోనే కవితను విచారించేందుకు కోర్టు అనుమతి కోరింది సీబీఐ. మార్చి 26 నుండి కవిత తీహార్ జైలులో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే.