Stock Market : ఉరుకులు పెడుతున్న స్టాక్.. ఆ కంపెనీ మీ పోర్ట్ ఫోలియోలో ఉంటే అదృష్టమే..!
Stock Market : ఇటీవల స్టాక్ మార్కెట్లు అప్స్ అండ్ డౌన్ అవుతూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇటీవల అమెరికా ఎన్నికలతో పాటు కార్పొరేట్ కంపెనీలు తమ ఫలితాలు ప్రకటించడంతో స్టాక్స్ లో భారీగా క్షీణత వచ్చింది. అయితే ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న కంపెనీ అవలోన్ టెక్నాలజీస్ . ఇవి గడచిన రెండు ట్రేడింగ్ సెషన్లలో కంపెనీ షేర్లు ఏకంగా 44 శాతం భారీ పెరుగుదలను చూడడం అందరిని ఆశ్చర్యింపజేశాయి. శుక్రవారం ఇంట్రాడేలో […]
ప్రధానాంశాలు:
Stock Market : ఉరుకులు పెడుతున్న స్టాక్.. ఆ కంపెనీ మీ పోర్ట్ ఫోలియోలో ఉంటే అదృష్టమే..!
Stock Market : ఇటీవల స్టాక్ మార్కెట్లు అప్స్ అండ్ డౌన్ అవుతూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇటీవల అమెరికా ఎన్నికలతో పాటు కార్పొరేట్ కంపెనీలు తమ ఫలితాలు ప్రకటించడంతో స్టాక్స్ లో భారీగా క్షీణత వచ్చింది. అయితే ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న కంపెనీ అవలోన్ టెక్నాలజీస్ . ఇవి గడచిన రెండు ట్రేడింగ్ సెషన్లలో కంపెనీ షేర్లు ఏకంగా 44 శాతం భారీ పెరుగుదలను చూడడం అందరిని ఆశ్చర్యింపజేశాయి. శుక్రవారం ఇంట్రాడేలో సరికొత్త 52 వారాల గరిష్ఠ స్థాయికి చేరాయి. దీనికి అసలు కారణం కంపెనీ ఇటీవల ప్రకటించిన సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాల గురించే.
Stock Market లాభాల బాట..
ఒక్కో షేరుకు రూ.250 డివిడెండ్.. నష్టాల మార్కెట్లోనూ లాభాల దూకుడు కనబరచడం జరిగింది.ఇన్వెస్టర్లు కంపెనీ షేర్లను కొనుగోలు చేసేందుకు భారీగా ఎగబడటంతో అవలోన్ టెక్నాలజీస్ రెండు ట్రేడింగ్ సెషన్లలో టాప్‌లో నిలిచింది.. వరుస అప్పర్ సర్క్యూట్ కారణంగా శుక్రవారం మార్కెట్లలో షేర్లు ఒక్కోటి రూ.849.45 స్థాయికి చేరుకున్నాయి. జూలై-సెప్టెంబర్ మధ్య కాలానికి సంబంధించిన కంపెనీ విడుదల చేసిన ఫలితాల ప్రకారం వార్షిక ప్రాతిపదికన నికర లాభం 140 శాతం పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ.17.48 కోట్లుగా ఉన్నట్టు అర్ధమైంది. అంటే గడిచిన ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ నికర లాభం కేవలం రూ.7.28 కోట్లుగా ప్రకటించబడిన సంగతి తెలిసిందే.
సెప్టెంబర్ త్రైమాసికంలో అవలోన్ టెక్నాలజీస్ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 36.80 శాతం పెరిగి రూ.275.02 కోట్లుగా నమోదైంది. అలాగే గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఆదాయం రూ.200.99 కోట్లుగా ఉంది. ప్రస్తుతం కంపెనీ ఆర్డర్ బుక్ రూ.1,490 కోట్ల ఆర్డర్ బుక్ కలిగి ఉంది. 2023 ఏప్రిల్ నెలలో కంపెనీ షేర్లు దేశీయ స్టాక్ మార్కెట్లో ఒక్కో షేరును అప్పర్ ప్రైస్ బ్యాండ్ ధర రూ.436 వద్ద విక్రయించడంగా జరిగింది. మార్కెట్లో స్టాక్ ధరను చూస్తే దాదాపుగా 100 శాతం రాబడిని అందించింది. కంపెనీ దేశంలోనే ఎండ్-టు-ఎండ్ సామర్థ్యాలను కలిగి ఉన్న ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ కంపెనీగా ఉంది. సెప్టెంబర్ 30, 2023 నాటికి రూ. 1,244 కోట్లతో పోలిస్తే ఆర్డర్ బుక్ గత త్రైమాసికంలో 19.4% పెరిగి రూ. 1,485 కోట్లకు చేరుకుంది.కస్టమ్ కేబుల్, వైర్ హార్నెస్, మెటల్, ప్లాస్టిక్, మాగ్నెటిక్స్ కాంపోనెంట్స్ మరియు ఇంజినీరింగ్ డిజైన్ మరియు డెవలప్‌మెంట్‌లో మెరుగైన సామర్థ్యాలతో కూడిన సామర్థ్యాలతో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీస్ ప్రొవైడర్‌గా నిమగ్నమై ఉంది