Telangana : 7 ఏళ్ల తెలంగాణలో ఎవరు బాగుపడ్డారు.. నాయకులా.. ప్రజలా…?
Telangana : తెలంగాణ వచ్చి అప్పుడే ఏడేళ్లు అయింది. నిజానికి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడానికి ఉద్యమించిందే.. తెలంగాణ ప్రాంతానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని. ఉమ్మడి ఏపీ పాలనలో ప్రభుత్వాలు ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాలకే నిధులు కేటాయించి.. ఆయా ప్రాంతాలను మాత్రమే అభివృద్ధి చేస్తున్నాయని.. తెలంగాణ ప్రాంతాన్ని ఎవ్వరూ పట్టించుకోవడం లేదని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమాలు జరిగాయి. చివరకు ఏపీ రెండు ముక్కలు అయింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది.
కట్ చేస్తే.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కూడా 7 ఏళ్లు అయింది. మరి.. అసలు తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఏర్పడిందో అ లక్ష్యం ఇప్పటికైనా నెరవేరిందా? తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిందా? ప్రజలు బాగుపడ్డారా? లేక నాయకులు బాగుపడ్డారా? అనే విషయాలు చర్చించాల్సి వస్తే మాత్రం అధికార పార్టీది ఒక లెక్కగా ఉంటే.. ప్రతిపక్షాల వ్యాఖ్యలు ఇంకో రకంగా ఉన్నాయి. ప్రజల వ్యాఖ్యలు చూస్తే ఇంకో రకంగా ఉన్నాయి.
Telangana : నిధులు, నీళ్లు, నియామకాలు వచ్చాయా?
నిధులు, నీళ్లు, నియామకాల కోసమే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడామని అప్పటి ఉద్యమ నాయకులు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ ఉద్యమంలో ఎక్కువగా పాల్గొన్నది టీఆర్ఎస్ పార్టీయే. ఆ పార్టీ అధినేత, ఇప్పటి సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ఉద్యమం ముందుకు సాగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చాక.. నీళ్లు, నియామకాలు, నిధులను తెచ్చుకుందామని.. మన రాష్ట్రాన్ని మనమే అభివృద్ధి చేసుకుందామని కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లారు. తెలంగాణ వచ్చింది.. తెలంగాణకు ముఖ్యమంత్రి కూడా ఆయనే అయ్యారు. కానీ.. అభివృద్ధి చూస్తే జీరో.. తెలంగాణ వల్ల లాభం పొందింది కేసీఆర్ ఫ్యామిలీనే అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్న విషయం తెలిసిందే.
ఉమ్మడి ఏపీలో తెలంగాణ ప్రజలు ఎలా ఉన్నారో.. ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. ప్రజలకు ఒరిగిన లాభం అయితే ఏం లేదు.. బాగుపడింది.. రాజకీయ నాయకులే అనే భావన ప్రస్తుతం తెలంగాణ ప్రజల్లో ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించినా.. నియామకాలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉన్నాయి. నిరుద్యోగ సమస్య రోజు రోజుకూ పెరుగుతోంది. ప్రతిపక్షాలు కూడా సీఎం కేసీఆర్ ను, టీఆర్ఎస్ పార్టీని నిధులు, నీళ్లు, నియామకాలపై విమర్శిస్తూనే ఉన్నాయి.
ఇది కూడా చదవండి == > Revanth Reddy : రేవంత్ రెడ్డికే టీపీసీసీ పీఠం.. కోమటిరెడ్డి, పొన్నంలకు ఆ పదవులు… రేపే ప్రకటన..?
ఇది కూడా చదవండి == > NTR : ఎన్.టి.ఆర్ పొల్టికల్ ఎంట్రీ ఇలా జరగనుందా..?
ఇది కూడా చదవండి == > ఒక్క చేప ధర 72 లక్షలు.. ఆ మత్స్యకారుడిని లక్షాధికారిని చేసింది.. దాని ప్రత్యేకత ఏమిటి…?