Siddu Jonnalagadda : సిద్ధూ జొన్నలగడ్డ బర్త్డే పార్టీలో ఫుల్ అయిన సెలబ్రిటీలు..వీడియో !
Siddu Jonnalagadda : ఫిబ్రవరి 7న డీజే టిల్లు సిద్ధు జొన్నలగడ్డ బర్త్ డే. ఈ సందర్భంగా సిద్దు జొన్నలగడ్డ ఆరోజు రాత్రి గ్రాండ్ గా పార్టీ ఇచ్చారు. ఆ పార్టీకి రానా, నవదీప్, సందీప్ కిషన్, అల్లు అరవింద్, శర్వానంద్, అనసూయ, శివాత్మిక, వైష్ణవి చైతన్య సీరత్ కపూర్, ఫరియా అబ్దుల్లా, నేహా రబ్బ తదితరులు పాల్గొన్నారు. సిద్దు జొన్నలగడ్డకి బర్త్డే విషెస్ చెబుతూ గ్రాండ్ గా పార్టీ చేసుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు […]
ప్రధానాంశాలు:
Siddu Jonnalagadda : సిద్ధూ జొన్నలగడ్డ బర్త్డే పార్టీలో ఫుల్ అయిన సెలబ్రిటీలు..!
Siddu Jonnalagadda : ఫిబ్రవరి 7న డీజే టిల్లు సిద్ధు జొన్నలగడ్డ బర్త్ డే. ఈ సందర్భంగా సిద్దు జొన్నలగడ్డ ఆరోజు రాత్రి గ్రాండ్ గా పార్టీ ఇచ్చారు. ఆ పార్టీకి రానా, నవదీప్, సందీప్ కిషన్, అల్లు అరవింద్, శర్వానంద్, అనసూయ, శివాత్మిక, వైష్ణవి చైతన్య సీరత్ కపూర్, ఫరియా అబ్దుల్లా, నేహా రబ్బ తదితరులు పాల్గొన్నారు. సిద్దు జొన్నలగడ్డకి బర్త్డే విషెస్ చెబుతూ గ్రాండ్ గా పార్టీ చేసుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక సిద్దు జొన్నలగడ్డ బర్త్ డే సందర్భంగా టిల్లు స్క్వేర్ మూవీ నుంచి గ్లింప్స్ ను విడుదల చేశారు మేకర్స్. రాత్రి సమయంలో కారు నడుపుతూ తన పక్కనే ఉన్న లిల్లీ ( అనుపమ పరమేశ్వరన్) నుండి టిల్లు మద్దును పొందడం గ్లింప్స్ లో చూడవచ్చు. అతని గత పుట్టినరోజు గురించి లిల్లీ అడగగా రాధికతో జరిగిన సంఘటనలను టిల్లు గుర్తు చేసుకోవడం ఆకట్టుకుంటుంది.
అయితే రాధికతో జరిగిన విషయాల గురించి టిల్లు పూర్తిగా చెప్పకుండా తనదైన హాస్య పద్ధతిలో సింపుల్ గా ముగించాడు. అలాగే ఆ విషయం అతనికి బాధ కలిగిస్తుంది కాబట్టి దాని గురించి ఇక ప్రశ్నలు అడగవద్దని లిల్లీని కోరుతాడు. మొత్తానికి ఇద్దరి మధ్య సంభాషణ ఎంతో వినోద భరితంగా సాగింది. సిద్దు జొన్నలగడ్డ తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో మరోసారి డైలాగులతో మ్యాజిక్ చేశాడు. ఈ గ్లింప్స్ లో అనుపమ పరమేశ్వరన్ గతంలో కంటే చాలా అందంగా మరింత గ్లామరస్ గా కనిపిస్తుంది. మొత్తానికి ఈ గ్లింప్స్ డీజే టిల్లులో జరిగిన విషయాలను గుర్తు చేయడమే కాకుండా టిల్లు స్క్వేర్ ఎలా ఉండబోతుందని ఆసక్తిని కూడా కలిగిస్తుంది. ఈ సినిమా ట్రైలర్ ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14న విడుదల కానుంది.
ఇక ఈ సినిమాకి ఎస్ తమన్ నేపథ్య సంగీతం అందించారు. మల్లిక్ రాం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ సినిమాను సమర్పిస్తుంది. ఈ సినిమాకి రామ్ మిరియాల అచ్చు రాజమణి సంగీతం అందిస్తుండగా, సాయి ప్రకాష్ ఉమ్మడి సింగు సినిమా ఆటోగ్రాఫి బాధ్యతలు చూస్తున్నారు. నవీన్ నూలి ఈ సినిమాకి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. డీజే టిల్లుకు మించి టిల్లు స్క్వేర్ సినిమా భారీ అంచనాలను అందుకోనున్నట్లుగా తెలుస్తుంది. డీజే టిల్లుతో సిద్దు జొన్నలగడ్డ స్టార్ బాయ్ అయిపోయాడు. మరోసారి టిల్లు స్క్వేర్ సినిమాతో మరోసారి అలాంటి మ్యాజిక్ ని కనబరుస్తాడేమో చూడాలి.