Revanth Reddy : కేసీఆర్ హయాంలో సైలెంట్.. రేవంత్ సర్కార్ హయాంలో ఎందుకీ వివక్ష..!
Revanth Reddy : అదేంటో గానీ కేసీఆర్ పదేండ్లు పరిపాలించినప్పుడు చాలా మంది సైలెంట్ గా ఉన్నారు. ఆయన ఏం చేసినా.. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని ఇష్టం వచ్చినట్టు పరిపాలించినా సరే ఎవరూ ధిక్కరించలేకపోయారు. అప్పట్లో కొంత మంది మీడియా అధినేతలు కొంత మంది కరుడుగట్టిన తెలంగాణ వాదులకు ఫోన్లు చేసి మరీ.. మనం సాధించిన తెలంగాణకు అన్యాయం జరుగుతోంది అని చెప్పినా సరే వారంతా మేం ఇప్పుడు ఏం చేయలేం అంటూ ఫోన్లు పెట్టేశారంట. అలాంటి వారు కూడా ఇప్పుడు రేవంత్ సర్కార్ మీద గొంతెత్తుతున్నారు. తెలంగాణకు ఎక్కడ లేని అన్యాయం జరుగుతోందని వారు వాపోతున్నారు.
Revanth Reddy ప్రజాస్వామ్య బద్దంగా పాలన..
అయితే కేసీఆర సర్కార్ హాయంలో చాలా మంది సైలెంట్ గా ఉండి.. ఇప్పుడు సూది పిన్ను చప్పుడైనా గగ్గోలు పెడుతున్నారు. మరి ఎందుకు ఇలా రేవంత్ సర్కార్ మీద అందరూ విరుచుకుపడుతున్నారనే అనుమానాలు అందరికీ వస్తున్నాయి. ఎందుకంటే ప్రజాస్వామ్యం విరాజిల్లిన చోటనే విమర్శలు ఎక్కువగా వినిపిస్తుంటాయి. అణచివేత కొనసాగిన సమయంలో గొంతులు నోరు మెదపవు. కానీ ఎక్కడైతే విమర్శలకు అవకాశం ఉంటుందో అక్కడనే మూగబోయిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక కామెంట్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు రేవంత్ సర్కార్ విషయంలో కూడా ఇదే జరుగుతోంది.
రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి భిన్నంగా పాలన సాగిస్తున్నారు. అంతకు ముందు లాగా కాకుండా ముఖ్యమంత్రి అయిన వెంటనే అందరినీ కలుపుకుని పోయారు. ప్రతిపక్ష నేతలను కూడా కలిసి కొత్త సాంప్రదాయానికి తెర తీశారు. ఎవరు విమర్శలు చేసినా సరే అందరికీ మౌనంగా సమాధానాలు ఇచ్చారు. మీడియా ముందుకు వచ్చి అందరు అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలు చెబుతున్నారు. తెలంగాణ కోసం తానుచేయబోయే అన్ని పనులను వివరిస్తున్నారు. ఎవరు విమర్శలు చేసినా సరే వాటిని స్వీకరిస్తున్నారు. అందుకే ఇప్పుడు రేవంత్ సర్కార్ విషయంలో ఇలాంటి విమర్శలు పెరిగాయని అంటున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయి ఇంకా ఆరు నెలలు కూడా కాలేదు. ఇంకా కుదురుకోనే లేదు అప్పుడే ఆయన సర్కార్ మీద తీవ్రమైన విమర్శలు రావడం ఏంటని మండిపడుతున్నారు కాంగ్రెస్ నేతలు.