Heart Attack | గుండెపోటు వచ్చే ముందు ఈ సంకేతాలు కనిపిస్తాయట.. అస్సలు నిర్లక్ష్యం చేయోద్దు..
Heart Attack | ఇటీవల కాలంలో గుండెపోటు సమస్యలు వృద్ధులతో పాటు యువతలోనూ తీవ్రమవుతున్నాయి. తక్కువ వయస్సులోనే అనేకమంది గుండెపోటు బారినపడి ప్రాణాలు కోల్పోతుండటంతో ఎంతోమంది కుటుంబాలు శోకంలో మునిగిపోతున్నారు.. గణాంకాల ప్రకారం, ప్రతి 40 సెకన్లకు ఒకరి గుండెపోటుకు గురవుతున్నారని చెప్పబడుతోంది.
గుండెపోటు చాలాసార్లు ఒక్కసారిగా రాకుండా, శరీరం ముందుగానే కొన్ని సంకేతాలను ఇవ్వవచ్చు. వాటిని గమనించడం ద్వారా ప్రమాదం నుంచి బయటపడే అవకాశం ఉంది. నిపుణుల ప్రకారం, ఈ హెచ్చరికలు ముఖ్యంగా చర్మం, శ్వాస, నిద్ర, అలసట రూపంలో కనిపిస్తాయి.

#image_title
1. చర్మంపై మార్పులు
కొలెస్ట్రాల్ పెరగడం వల్ల చర్మంపై చిన్న చిన్న మచ్చలు లేదా దద్దుర్లు రావచ్చు.
గోళ్ల కింద ఎర్రటి లైన్లు కనిపిస్తే, అది గుండె ఇన్ఫెక్షన్‌కు సూచన కావచ్చు.
కళ్ల చుట్టూ బూడిద రంగు మచ్చలు గుండె సంబంధిత సమస్యల సంకేతం కావచ్చు.
2. అలసట & నిద్రలేమి
2003లో గుండెపోటు నుంచి బయటపడ్డ 515 మంది మహిళలపై జరిపిన అధ్యయనంలో,
71% మందికి తీవ్రమైన అలసట,
47.8% మందికి నిద్రలేమి,
42.1% మందికి శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలు గుండెపోటుకు ఒక నెల ముందే కనిపించాయి.
3. ఛాతీ నొప్పి & ఇతర భౌతిక లక్షణాలు
ఛాతీలో తీవ్రమైన నొప్పి
అధిక చెమట
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
నొప్పి ఛాతీ నుంచి భుజం, చేయి, దవడ వరకూ వ్యాపించటం
మహిళల్లో కడుపులో అసౌకర్యం, వెన్నునొప్పి వంటి లక్షణాలు కూడా ఉండవచ్చు.
గుండెపోటులు కొన్ని సార్లు సైలెంట్ అటాక్స్ (నిశ్శబ్ద గుండెపోటులు)గా వస్తాయి. వీటిలో స్పష్టమైన లక్షణాలు కనిపించకపోవచ్చు. అందుకే వీటిని “సైలెంట్ కిల్లర్”గా పరిగణిస్తారు. ఆహారపు అలవాట్లు మెరుగుపర్చడం, శారీరక వ్యాయామం, ఒత్తిడిని నియంత్రించడం, ఆరోగ్య పరీక్షలు క్రమం తప్పకుండా చేయించుకోవడం వలన గుండె పోటు బారిన పడకుండా ఉండవచ్చు.