Boat Smart Watch : బోట్ కంపెనీ నుంచి అదిపోయే ఫీచర్లతో స్మార్ట్ వాచ్ విడుదల..
Boat Smart Watch : దేశీయ బ్రాండ్ బోట్ కంపెనీ తమ వినియోగ దారులకు శుభవార్త చెప్పింది. స్మార్ట్ ఉత్పత్తుల తయారీ విభాగంలో తనదైన సత్తా చాటుతున్న ఈ కంపెనీ బడ్జెట్ ధరలో హై ఎండ్ స్మార్ట్ వాచ్‌ను విడుదల చేసింది. బోట్ ఎక్స్టెండ్ టాక్ పేరుతో లాంచ్ చేసిన ఈ స్మార్ట్ వాచ్‌కు అలెక్సా వాయిస్ అసిస్టెంట్ సపోర్టు కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనికి IP68 రేటింగ్, మరిన్ని ఫీచర్లను జతచేసింది. దేశీయ మార్కెట్లో దీని ధర, ఫీచర్లు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
Boat Smart Watch : స్టూడెంట్స్, జాబర్స్‌కు మంచి బెనిఫిట్
బోట్ ఎక్స్టెంట్ టాక్ పేరిట విడుదలైన స్మార్ట్ వాచ్ రెక్టాంగ్యులర్ ఆకారంలో స్క్రీన్‌ను ఇచ్చారు. దీనికి మ్యాన్యువల్ ఆపరేషన్ కోసం కుడి వైపున ఒక హార్డ్ బటన్‌ను అమర్చారు. ఇది హెచ్‌డీ రిజల్యూషన్‌తో పనిచేసే 1.69-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉండగా..ఈ స్మార్ట్ వాచ్‌లో హార్ట్ రేట్ సెన్సార్, SpO2 మానిటర్, VO2 మ్యాక్స్ మానిటర్ వంటి ఫీచర్లను అదనంగా ఇచ్చారు. ఇది నడిచే సమయంలోకెలోరీలు సహా మరి కొన్నింటిని ట్రాక్ చేయగలదు. ఈ డివైజ్ 60+ స్పోర్ట్స్ మోడ్‌లతో రానుంది. ఆటో వర్కౌట్ డిటెక్షన్ ఫీచర్‌ను కూడా ఇందులో ఇచ్చారు.
ఈ వాచ్‌ను ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే సాధారణ వినియోగంతో 10 రోజుల బ్యాటరీ లైఫ్ ఉంటుంది.బ్లూటూత్ కాలింగ్ వాడితే 2 రోజుల వరకు చార్జింగ్ ఉంటుందని పేర్కొన్నారు. 300mAh బ్యాటరీ పవర్ దీని సొంతం. ఇక ఈ స్మార్ట్ ధర విషయానికొస్తే ప్రారంభ ధరను రూ.2,999గా కంపెనీ నిర్ణయించింది. దీనిని అమెజాన్ ఇండియా, ఇతర పోర్టల్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఇది పిచ్ బ్లాక్, చెర్రీ బ్లోసమ్, టీమ్ గ్రీన్ సహా మూడు రంగులలో దొరుకుతోంది. బడ్జెట్ ధరలో స్మార్ట్ వాచ్ రావడంతో ఇది స్టూడెంట్స్, ఉద్యోగస్తులకు చాలా బాగా ఉపయోగపడుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.