Smart Watch : మీ చేతికి స్మార్ట్ వాచ్ ని పెడుతున్నారా… అయితే, ఇది మీకోసమే…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Smart Watch : మీ చేతికి స్మార్ట్ వాచ్ ని పెడుతున్నారా… అయితే, ఇది మీకోసమే…?

 Authored By ramu | The Telugu News | Updated on :31 July 2025,12:00 pm

ప్రధానాంశాలు:

  •  Smart Watch : మీ చేతికి స్మార్ట్ వాచ్ ని పెడుతున్నారా... అయితే, ఇది మీకోసమే...?

Smart Watch : సాధారణంగా చాలామంది చేతిని అందంగా కనిపించేందుకు స్మార్ట్ వాచ్ ని స్టైల్ కోసం, ఇంకా అవసరాల కొరకు వినియోగిస్తున్నారు. ఈ స్మార్ట్ వాచ్ ఎలా పాడాలి అనే విషయం కూడా తెలియకుండానే ఉపయోగిస్తూ ఉంటారు. అలాంటివారికి ముఖ్యంగా, చార్జింగ్ చేసే స్మార్ట్ వాచ్లు వాడే వారికి ఇది తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఇలాంటి స్మార్ట్ వాచ్లు చేయి మణికట్టు నుండి తీసి చార్జింగ్ పెట్టేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలంటున్నారు ప్రముఖులు. మరి స్మార్ట్ వాచ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దీని వెనుక దాగి ఉన్న పూర్తి వివరాలు ఏమిటో తెలుసుకుందాం. చాలామంది కూడా స్మార్ట్ వాచ్ ని ధరిస్తూ కనిపిస్తున్నారు.అది పురుషులైనా, స్త్రీలైనా. స్మార్ట్ వాచి నడిచే అడగులను లెక్కించడంతోపాటు, హార్ట్ రేట్, స్లీప్ మోనిటర్స్ చెక్ చేసుకోవచ్చు. కాల్స్ కూడా మాట్లాడే స్మార్ట్ వాచ్ లు ఉన్నాయి. అలాగే మీ స్మార్ట్ ఫోన్ కి కనెక్ట్ చేసుకుని మెసేజ్లు కూడా చూడవచ్చు. వాట్సాప్ నోటిఫికేషన్ చెక్ చేయవచ్చు, కాల్స్ కూడా మాట్లాడవచ్చు. అయితే, ఇన్ని ఫీచర్స్ ఉన్న స్మార్ట్ వాచ్ వాడకం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

Smart Watch మీ చేతికి స్మార్ట్ వాచ్ ని పెడుతున్నారా అయితే ఇది మీకోసమే

Smart Watch : మీ చేతికి స్మార్ట్ వాచ్ ని పెడుతున్నారా… అయితే, ఇది మీకోసమే…?

Smart Watch స్మార్ట్ వాచ్ వాడే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి

కొంతమందికి స్మార్ట్ వాచ్ లు వాడేటప్పుడు చర్మ సమస్యలు కూడా తలెత్తుతాయి. వాచ్ ని చాలా గట్టిగా కాకుండా కొంచెం వదులుగా ఉండేలా చేతికి పెట్టుకుంటే మంచిది. స్మార్ట్ వాచ్ ని పెట్టుకుంటే దాని నుంచి రేడియేషన్ వచ్చి తలనొప్పి, వికారం లాంటి సమస్యలు కూడా వస్తున్నాయని అంటున్నారు. ఇలాంటి సమస్యలు ఉంటే వాచ్ ని వాడడం తగ్గించడం ఉత్తమం, పూర్తిగా మానేసిన పర్వాలేదు.
నాట్ వాచ్ వినియోగం కొందరికి నిద్రలేమి సమస్యలను తెచ్చి పెడుతుంది అంతేకాదు నిద్రపోయే ముందు స్మార్ట్ వాచ్ తీసివేయడం కూడా మరిచిపోతే అది ఇంకా నిద్రపో బంగాన్ని కలిగిస్తుంది. నాట్ వాచ్ ని కొన్ని నీటి నిరోధకత కలిగి ఉన్నప్పటికీ, వాటిని ఎక్కువసేపు నీటిలో ఉంచితే అంత మంచిది కాదు. అందుకే వీటిని నీటికి దూరంగా ఉంచడమే మేలు.

స్మార్ట్ వాచ్ ని చార్జింగ్ పెట్టేటప్పుడు అది ఎక్కువ వేడెక్కుతుందో లేదో కూడా గమనించుకోవాలి.ఎక్కువగా వేడెక్కుతున్నట్లు మీరు గమనించినట్లయితే వెంటనే చార్జింగ్ ఆపేయడం ఉత్తమం. వాచ్ లో అనేక ఫీచర్లు ఉన్నప్పటికీ,అన్ని ఫీచర్లను ఉపయోగించకపోవచ్చు. కాబట్టి,మీకు అవసరమైన అంతవరకు మాత్రమే ఫీచర్లను మాత్రమే ఉపయోగిస్తే మంచిది. స్మార్ట్ వాచ్ లో కేవలం బరువు తగ్గడానికి మాత్రమే ఉపయోగపడదు. ఇది మీ ఆరోగ్యానికి సంబంధించిన అనేక విషయాలను గమనిస్తూ ఉంటుంది. అందుకే దీన్ని జాగ్రత్తగా వాడాలి. ముఖ్యంగా, అనారోగ్య సమస్యలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది