Soaked Vs Dry Dates | ఖర్జూరం తినటం వలన ఎలాంటి లాభాలు?.. ఎండినవా లేక నానబెట్టినవి బెటరా?
Soaked Vs Dry Dates |
ఖర్జూరం ప్రకృతి ప్రసాదించిన ఓ అద్భుతమైన పండు. సహజ తీపితో పాటు పుష్కలమైన పోషకాలు కలిగి ఉండే ఈ పండును ప్రపంచవ్యాప్తంగా ఎడారి ప్రాంతాల నుంచి పట్టణ జీవితం వరకు ఎంతో ఆదరిస్తున్నారు. ముఖ్యంగా ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
ఎండిన ఖర్జూరం మంచిదా? లేక నానబెట్టిన ఖర్జూరం మంచిదా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. ఈ రెండు రకాల ఖర్జూరాల మధ్య తేడేంటి? ఏది ఎప్పుడు తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎండిన ఖర్జూరాల ప్రయోజనాలు:
* సహజ చక్కెర, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది
* శరీరానికి వెంటనే శక్తిని అందిస్తుంది – ఫటాఫట్ ఎనర్జీ కావాలనుకునే వారికి బెస్ట్
* శీతాకాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది
* ఇందులో ఉండే ఇనుము, కాల్షియం వంటి ఖనిజాలు ఎముకల ఆరోగ్యానికి మంచివి
* రక్తహీనత (అనిమియా) నివారణకు ఉపయోగపడుతుంది
నానబెట్టిన ఖర్జూరాల ప్రయోజనాలు:
* నీటిలో లేదా పాలలో నానబెట్టితే తినటానికి సులభం, జీర్ణం సాఫీగా జరుగుతుంది
* సహజ చక్కెర కాస్త తక్కువగా ఉండటం వల్ల మధుమేహం ఉన్నవారికి తక్కువ ప్రమాదం
* జీర్ణక్రియ మెరుగవుతుంది – మలబద్ధకం తగ్గుతుంది
* గ్యాస్, గుండెల్లో మంట ఉన్నవారికి ఎంతో ఉపశమనం
* ఉదయాన్నే ఖాళీ కడుపుతో తింటే పోషకాలు త్వరగా శరీరానికి అందుతాయి
అయితే ఏది మంచిది?
తక్షణ శక్తి కావాలంటే – ఎండిన ఖర్జూరం
సులభ జీర్ణం కోసం – నానబెట్టిన ఖర్జూరం
శీతాకాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవాలంటే – ఎండిన ఖర్జూరం బెటర్
గ్యాస్, అలర్జీలు, జీర్ణ సమస్యలున్నవారికి – నానబెట్టిన ఖర్జూరాలు ఉత్తమం
ఎండినా, నానబెట్టినా — ఖర్జూరాలు రెండు కూడా మంచి పోషక విలువలు కలిగి ఉన్నాయి. మీ శరీర అవసరాలు, వయస్సు, ఆరోగ్య స్థితిని బట్టి ఏది ఎంచుకోవాలో నిర్ణయించుకోవడం ఉత్తమం.