Rithu Chowdary : జబర్దస్త్ లో సోషల్ మీడియా స్టార్ రీతూ చౌదరి గ్లామర్ షో? హైపర్ ఆది స్కిట్ లో రచ్చ?
Rithu Chowdary : రీతూ చౌదరి తెలుసా మీకు. పలు సీరియళ్లు, సినిమాల్లో నటించడంతో పాటు.. సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటి ఈమె. సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉండేవాళ్లకు ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తను ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మామూల్ది కాదు. తను టిక్ టాక్ నుంచి స్టార్ అయింది. ఆ తర్వాత తనకు సినిమాల్లోనూ చాన్స్ వచ్చింది. ఉప్పెన సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గానూ నటించింది రీతూ చౌదరి. ఆ తర్వాత గోరింటాకు సీరియల్ లో కూడా తనకు అవకాశం వచ్చింది. ఇప్పుడిప్పుడే పెద్ద సినిమాల్లో కూడా తనకు ఆఫర్లు వస్తున్నాయి. ఏది ఏమైనా తను ఇప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటుంది.

social media star rithu chowdary in jabardasth
తాజాగా.. జబర్దస్త్ లోకి కూడా రీతూ చౌదరి ఎంట్రీ ఇచ్చింది. తన అందాలను ఆరబోసింది. చీర కట్టుకొని వచ్చి హైపర్ ఆది స్కిట్ లో ఓ క్యారెక్టర్ చేసింది రీతూ చౌదరి. మొత్తానికి చీరకట్టులో రీతూ చౌదరి అందం చూసి కుర్రకారు తట్టుకోలేకపోతున్నారు. ఎంతైనా రీతూ చౌదరి అందమే వేరు. తను కూడా పాపులర్ యాక్టర్ అవ్వాలని తెగ ప్రయత్నిస్తోంది.

social media star rithu chowdary in jabardasth
Rithu Chowdary : జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇస్తే.. సూపర్ స్టార్ అయిపోయినట్టే

social media star rithu chowdary in jabardasth
జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రతి ఒక్కరు సూపర్ స్టార్లు అయిపోయారు. అందరికీ మంచి పేరు వచ్చింది. బిజీ స్టార్లు అయిపోయారు. అవకాశాలు కూడా వెతుక్కుంటూ వస్తున్నాయి. దానికి ఉదాహరణ చెప్పాలంటే చాలామంది ఉన్నారు. ఇటీవలే జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చి.. పెద్ద సెలబ్రిటీ అయిపోయింది వర్ష. ఇప్పుడు వర్ష బాటలోనే రీతూ చౌదరి కూడా నడవనుంది కాబోలు. డైరెక్ట్ గా హైపర్ ఆది స్కిట్ లోకే ఎంట్రీ ఇచ్చేసింది. ఇంకేంటి.. ఇలాగే ఓ రెండు మూడు స్కిట్లలో కనిపిస్తే చాలు.. రీతూ చౌదరిని కూడా పెద్ద సెలబ్రిటీని చేసేస్తారు ప్రేక్షకులు. తాజాగా జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమోలో హైపర్ ఆది స్కిట్ లో కనిపించిన రీతూ చౌదరి బాగానే పర్ ఫార్మ్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమోను చూసేయండి.
