TDP : టీడీపీకి భారీ షాక్? ఈనెల 13న పార్టీ మారబోతున్న కీలక నేతలు? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

TDP : టీడీపీకి భారీ షాక్? ఈనెల 13న పార్టీ మారబోతున్న కీలక నేతలు?

TDP : ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్ అంటే తిరుపతి ఉపఎన్నిక. తిరుపతి ఎన్నికల్లో ప్రధాన పోటీ అంటే అధికార వైసీపీ, టీడీపీ మధ్యే. అధికార వైసీపీ పార్టీ ఎలాగైనా తిరుపతి ఎంపీ సీటును గెలచుకొని… ఏపీలో వైసీపీకి తిరుగులేదు.. అని చాటి చెప్పాలని తెగ ప్రయత్నిస్తోంది. టీడీపీ కూడా తిరుపతిలో గెలిచి… టీడీపీ పార్టీ సత్తా ఇది అని చాటి చెప్పాలని తెగ ప్రయత్నిస్తోంది. ఈ రెండు పార్టీల మధ్యలో బీజేపీ పార్టీ కూడా బాగానే […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :9 April 2021,3:10 pm

TDP : ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్ అంటే తిరుపతి ఉపఎన్నిక. తిరుపతి ఎన్నికల్లో ప్రధాన పోటీ అంటే అధికార వైసీపీ, టీడీపీ మధ్యే. అధికార వైసీపీ పార్టీ ఎలాగైనా తిరుపతి ఎంపీ సీటును గెలచుకొని… ఏపీలో వైసీపీకి తిరుగులేదు.. అని చాటి చెప్పాలని తెగ ప్రయత్నిస్తోంది. టీడీపీ కూడా తిరుపతిలో గెలిచి… టీడీపీ పార్టీ సత్తా ఇది అని చాటి చెప్పాలని తెగ ప్రయత్నిస్తోంది. ఈ రెండు పార్టీల మధ్యలో బీజేపీ పార్టీ కూడా బాగానే కష్టపడుతోంది. రెండు పార్టీలను కాదని… బీజేపీ ఏమైనా తిరుపతి ఓటరు ఓటు వేస్తాడేమో అని తెగ ఆశ పడుతోంది.

some tdp leaders to join in ysrcp on april 13

some tdp leaders to join in ysrcp on april 13

అయితే… తిరుపతి ఉపఎన్నిక విషయంలో ఎక్కువ నష్టపోయేది టీడీపీ పార్టీనే అంటూ రాజకీయ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే… ప్రస్తుతం టీడీపీ పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. కొందరు కీలక నేతలు కూడా చాలా అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో సమయం దొరికినప్పుడు వేరే పార్టీకి చెక్కేయాలని వాళ్లు భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉన్న కొందరు టీడీపీ నేతలు తిరుపతి ఉపఎన్నికకు ముందే పార్టీ నుంచి బయటికి రావాలని నిర్ణయించుకున్నారని రాజకీయ వర్గాల్లో వినికిడి.

TDP : వైసీపీలో చేరేందుకు ఆసక్తి చూపిన తిరుపతి టీడీపీ నేతలు అంటూ ప్రచారం?

అయితే… తిరుపతి నియోజకవర్గానికి చెందిన కొందరు కీలక నేతలు… వైసీపీలో చేరేందుకు రంగం కూడా సిద్ధం చేసుకున్నారంటూ తిరుపతిలో ఈ వార్త తెగ ప్రచారంలో ఉంది. అది కూడా ఎన్నికలకు ఓ రెండు రోజుల ముందు అంటే ఈనెల 13న వైసీపీలో వాళ్లు చేరే అవకాశం ఉండొచ్చు అని అంటున్నారు. కొందరు నేతలు…. వైసీపీ పెద్దలతో చర్చలు కూడా జరిపారట. కొందరు మంత్రులతో కూడా ఆయా టీడీపీ నేతలు సన్నిహితంగా ఉన్నట్టు తెలుస్తోంది. జగన్ కూడా వాళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని… ఇక పార్టీ తీర్థం పుచ్చుకోవడమే తరువాయి… అనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది.

వైసీపీలోకి చేరాలనుకునేవాళ్లలో ఎక్కువ మంది గతంలో వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లినవాళ్లేనట. అప్పుడు టీడీపీలోకి వెళ్లి… ఇబ్బందులు పడుతూ అక్కడ ఇమడలేక అసంతృప్తితో మళ్లీ తమ సొంత పార్టీలోకి వెళ్లాలని భావిస్తున్నారట. టీడీపీ నేతలతో పాటు… కొందరు కాంగ్రెస్ నేతలు కూడా పార్టీ మారేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు సమాచారం. ఏది ఏమైనా… పార్టీలోకి రావాలనుకుంటే… తిరుపతి ఎన్నికకు ముందు రావాలని… అప్పుడే ఏదైనా ప్రయోజనం ఉంటుందని వైసీపీ హైకమాండ్ నుంచి సమాచారం కూడా వాళ్లకు చేరిందట. దీంతో ఎన్నికలకు ముందే పార్టీలో చేరేందుకు అన్నీ సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. మరి… ఇది నిజమా? అబద్ధమా? ఉత్త పుకారేనా? అనేది తెలియాలంటే మాత్రం ఈనెల 13 దాకా ఆగాల్సిందే.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది