Sonia Gandhi : ఆ ‘ రెడ్డి ‘ గారిని మినిమమ్ కేర్ చేయని సోనియా గాంధీ
Sonia Gandhi : తెలంగాణ వ్యాప్తంగా కోమటిరెడ్డి వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాలు మారిపోయాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో కాంగ్రెస్ లో ఒక్కసారిగా కలకలం లేపింది. తాజాగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీని వీడుతారని.. తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తారనే వార్తలు ఇప్పుడు గుప్పుమంటున్నారు. మొత్తానికి కోమటిరెడ్డి బ్రదర్స్ వ్యవహారం తెలంగాణలో సంచలనం సృష్టిస్తోంది. కోమటిరెడ్డి బ్రదర్స్ వ్యవహారంతో కాంగ్రెస్ నాయకులు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అయితే కోమటిరెడ్డి బ్రదర్స్ గురించి కాంగ్రెస్ హైకమాండ్ కూడా పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ ను లైట్ తీసుకున్నట్టు తెలుస్తోంది.
Sonia Gandhi : వెంకట్ రెడ్డి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారా?
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డిపై సీరియస్ అయ్యారు. మునుగోడులో పార్టీ నిర్వహించిన సభలోనూ పార్టీ నేతలంతా రెచ్చిపోయి కోమటిరెడ్డిపై విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత కొందరు కాంగ్రెస్ నాయకులు కోమటిరెడ్డికి క్షమాపణలు కూడా చెప్పారు. మరోవైపు రాజగోపాల్ రెడ్డి మునుగోడులో రాజీనామా చేయడంతో ఉపఎన్నిక అనివార్యం అయింది. కానీ.. మునుగోడు ఉపఎన్నిక విషయంలోనూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎటువంటి చొరవ చూపడం లేదట. కనీసం పార్టీ సమావేశాలకు కూడా రావడం లేదట.
ఓవైపు సొంత తమ్ముడు రాజీనామా చేస్తే ఆ విషయం గురించి మాట్లాడుకుండా వేరే విషయాల గురించి కోమటిరెడ్డి మాట్లాడుతున్నారంటూ కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఓవైపు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం ఏంటంటూ విమర్శిస్తున్నారు. కాకపోతే కోమటిరెడ్డి అనుచరులు కూడా ఆయన్ను ఫాలో అవడం లేదని తెలుస్తోంది. ఆయన్ను పట్టించుకోకుండానే ఆయన అనుచరులు సమావేశం నిర్వహించాలంటూ పార్టీ ఆదేశించినట్టు తెలుస్తోంది. మొత్తం మీద కోమటిరెడ్డి బ్రదర్స్ వ్యవహారం తెలంగాణ వ్యాప్తంగా పెద్ద దుమారమే లేపింది. చూద్దాం మున్ముందు వీళ్లు వ్యవహారం ఎంత దూరం వెళ్తుందో.