KCR Vs Sonia Gandhi : పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్, బీఆర్ఎస్ ఫోకస్ .. సోనియా గాంధీకి పోటీగా కేసిఆర్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

KCR Vs Sonia Gandhi : పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్, బీఆర్ఎస్ ఫోకస్ .. సోనియా గాంధీకి పోటీగా కేసిఆర్..!

KCR Vs Sonia Gandhi  : మొన్నటిదాకా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల జరిగాయి. అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఇప్పుడు మరికొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. అయితే హైదరాబాదుకు కూతవేటు దూరంలో ఉన్న మెదక్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పోటీ చేయాలని కాంగ్రెస్ తెలంగాణ రాజకీయం విభాగం తీర్మానం చేసింది. రాజకీయ విభాగం అన్నాక ఎన్నో తీర్మానాలు చేస్తూ ఉంటుంది అందులో ఇది ఒకటి. అలా అని తేలికగా తీసుకోకూడదు. ఎందుకంటే […]

 Authored By anusha | The Telugu News | Updated on :20 December 2023,3:10 pm

ప్రధానాంశాలు:

  •  KCR Vs Sonia Gandhi : పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్, బీఆర్ఎస్ ఫోకస్ .. సోనియా గాంధీకి పోటీగా కేసిఆర్..!

KCR Vs Sonia Gandhi  : మొన్నటిదాకా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల జరిగాయి. అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఇప్పుడు మరికొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. అయితే హైదరాబాదుకు కూతవేటు దూరంలో ఉన్న మెదక్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పోటీ చేయాలని కాంగ్రెస్ తెలంగాణ రాజకీయం విభాగం తీర్మానం చేసింది. రాజకీయ విభాగం అన్నాక ఎన్నో తీర్మానాలు చేస్తూ ఉంటుంది అందులో ఇది ఒకటి. అలా అని తేలికగా తీసుకోకూడదు. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాబట్టి అది వేసే ప్రతి అడుగు కూడా ఎంతో కొంత విజిబుల్ ఉంటుంది. అలాంటప్పుడు సోనియా గాంధీని మెదక్ నుంచి పోటీ చేయాలని తీర్మానం చేయడం కొంచెం ఆసక్తికరమే. అయితే దీనికి సోనియా గాంధీ ఒప్పుకుంటారా లేదా అనేది తర్వాత విషయం.మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఆశించిన స్థానాలు రాలేదు. ఇది కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గం. హరీష్ రావు కూడా ఈ జిల్లా వాసి కావడంతో ప్రెస్ జోరుకు ఈ జిల్లా బ్రేక్ వేసిందని చెప్పాలి. అయితే మెదక్ నియోజకవర్గం నుంచి గతంలో దివంగత ప్రధాని ఇందిరాగాంధీ కూడా పోటీ చేశారు.

వై.యస్.రాజశేఖర్ రెడ్డి హయాంలో మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండేది. అందుకే మెదక్ నుంచి సోనియాగాంధీ పోటీ చేస్తే బాగుంటుంది అని కాంగ్రెస్ పార్టీ రాజకీయ విభాగం అభిప్రాయానికి వచ్చింది. ఇక సోనియా గాంధీకి పోటీగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్ పోటీ చేస్తారని పేరు వినిపిస్తుంది.ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ తన సొంత నియోజకవర్గం గజ్వేల్ నుంచి పోటీ చేసి గెలిచారు. కామారెడ్డి నియోజకవర్గంలో ఓడిపోయారు. నిజానికి గజ్వేల్ లో ఈటల రాజేందర్ కొంచెం ఎఫర్ట్ పెట్టి ఉంటే ఫలితం మరో విధంగా ఉండేదని రాజకీయ విశ్లేషకులు ఇప్పటికే అంటున్నారు. అయితే మెదక్ సెట్టింగ్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం దుబ్బాక ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే ఆ స్థానం నుంచి పోటీ చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అదే జరిగితే గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నిక రావడం ఖాయం అని అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ మెదక్ నుంచి పోటీ చేస్తారా.. ఒకవేళ ఆయన ఎంపీ అయినా చేసేది ఏమీ లేదని,

అలాంటప్పుడు కేసీఆర్ ఎలాంటి సందేశం తో పోటీ చేస్తారు అని రాజకీయ వర్గాలలో వినిపిస్తున్నాయి. అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ అభ్యర్థులపై చర్చలు జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ నుంచి కిషన్ రెడ్డి పోటీ చేస్తారు అనే ప్రచారం జరుగుతుంది . కిషన్ రెడ్డి మెదక్ నుంచి పోటీ చేస్తే బిజెపికి జరిగే లాభం కంటే నష్టం ఎక్కువ అని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈటల రాజేందర్ కూడా ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే డీకే అరుణ ను మెదక్ నుంచి బరిలోకి దింపితే ఎలా ఉంటుందని చర్చ నడుస్తుంది. మొత్తానికి మెదక్ పార్లమెంట్ స్థానంపై భలే చర్చ జరుగుతుంది. ప్రస్తుతం సోనియా గాంధీ కి ఉన్న అనారోగ్య పరిస్థితులు దృష్ట్యా ఆమె మెదక్ నుంచి పోటీ చేస్తారా అనేది ఒకింత అనుమానమే. ఇక కేసీఆర్ కూడా ఇంకా కోలుకోలేదు. బీజేపీలో చర్చలు తప్ప అభ్యర్థి ఎవరో తెలియదు. ఇలా పార్లమెంట్ ఎన్నికలకు ఇరుపక్ష పార్టీలలో చర్చలు జరుగుతున్నాయి.

anusha

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది