ఈటల కొత్త పార్టీ.. కాంగ్రెస్‌లో టెన్షన్.. అర్జెంట్ గా రేవంత్ ని ఢిల్లీకి రమ్మన్న సోనియా
Etela New Party : ప్రస్తుతం తెలంగాణలో ఎక్కడ చూసినా ఈటల రాజేందర్ కొత్త పార్టీ గురించే చర్చ. ఆయన త్వరలో కొత్త పార్టీ పెడుతున్నారంటూ జోరుగా వార్తలు ఊపందుకున్నాయి. ఈటల వ్యవహారాన్ని మొదటి నుంచి గమనిస్తే.. ఆయనకు ఇక టీఆర్ఎస్ పార్టీలో భవిష్యత్తు లేదని స్పష్టమయింది. దీంతో ఆయన వేరే దారి వెతుక్కుంటున్నారు. కొత్త పార్టీనా? లేక వేరే పార్టీలోకి వెళ్తారా? అనేది ప్రస్తుతం సస్పెన్స్ గా ఉన్నా.. ఈటల రాజేందర్ కొత్త పార్టీ మాత్రం చాలామందికి లేనిపోని టెన్షన్ తీసుకొస్తున్నదట. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి కూడా ఈటల కొత్త పార్టీ పెడుతుండటం పెద్ద తలనొప్పిని తీసుకొస్తోందట.
అసలు.. ఈటల కొత్త పార్టీ పెడితే… సోనియా గాంధీకి వచ్చిన నష్టం ఏంటి? అనే కదా మీ ప్రశ్న. ఎందుకంటే.. ఈటల కొత్త పార్టీ పెడుతుండటం, ఆ పార్టీలో రేవంత్ రెడ్డి ప్రధాన భూమిక పోషిస్తున్నారు.. అనే వార్త ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో.. ఈటల పార్టీలోకి రేవంత్ రెడ్డి వెళ్తారా? అనే టెన్షన్ సోనియమ్మకు స్టార్ట్ అయిందట. టీపీసీసీ చీఫ్ పదవిని కూడా ఇప్పటి వరకు ఎవ్వరికీ ఇవ్వలేదు. రేవంత్ రెడ్డికే ఇస్తారు.. అంటూ ఊరిస్తున్నా.. అధిష్ఠానం ఎటూ తేల్చుకోలేకపోయింది. పార్టీ కోసం బాగానే కష్టపడుతున్నా… పార్టీ నుంచి సరైన గుర్తింపు రావడం లేదని రేవంత్ రెడ్డి భావిస్తున్నారని.. అందుకే రేవంత్… ఈటల పార్టీలోకి వెళ్తారనే ఊహాగానాలు బాగా వినిపిస్తున్నాయి.
Etela New Party : త్వరలోనే టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని ప్రకటించే అవకాశం?
ఒకవేళ టీపీసీసీ చీఫ్ పదవిని రేవంత్ రెడ్డికి అప్పగిస్తే రేవంత్ రెడ్డి పార్టీ మారే నిర్ణయాన్ని మార్చుకుంటారని.. అందుకే.. టీపీసీసీ చీఫ్ పదవి నియామకం వ్యవహారాన్ని ముమ్మరం చేసింది కాంగ్రెస్ అధిష్ఠానం. ఇక ఆలస్యం చేయకూడదని.. వెంటనే టీపీసీసీ చీఫ్ పదవిని ప్రకటించాలని సోనియమ్మ నిర్ణయం తీసుకున్నారట. పార్టీ హైకమాండ్ కూడా రేవంత్ రెడ్డికే మొగ్గు చూపిందట. ఒకవేళ తెలంగాణలోని సీనియర్ల నుంచి వ్యతిరేకత వచ్చినా… ఎవరైనా హద్దు మీరినా.. పార్టీ నుంచి వాళ్లను సస్పెండ్ చేయడానికి కూడా అధిష్ఠానం వెనకాడకూడదని నిర్ణయించుకుందట.
Etela New Party : ఈటలను కాంగ్రెస్ లోకి తీసుకురావడానికి ముమ్మరంగా ప్రయత్నాలు
అయితే.. ఈటల కొత్త పార్టీ పెడుతున్నారంటూ వార్తలు రావడంతో… ఈటల కొత్త పార్టీ పెట్టడం కన్నా.. కాంగ్రెస్ పార్టీలోకి వస్తే బాగుంటుందని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోందట. అందుకే… ఈటలతో చర్చలు జరపాలని హైకమాండ్… కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ముఖ్య నాయకుడికి బాధ్యతలు అప్పగించిందట. మరి… ఆ నేత ఈటలతో చర్చలు జరిపారో లేదో కానీ… సీఎం కేసీఆర్.. తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి మోసం చేశారని… కాంగ్రెస్ పార్టీలో చేరి… ఈటల కాంగ్రెస్ పార్టీ రుణం తీర్చుకోవాలని కాంగ్రెస్ నాయకులు కూడా భావిస్తున్నారట. చూద్దాం మరి.. ఈటల కొత్త పార్టీ పెడతారా? లేక కాంగ్రెస్ లోకి వెళ్తారా ?