Sonu Sood : సోనూ సూద్ ను చూడటం కోసం ఓ అభిమాని ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Sonu Sood : సోనూ సూద్ ను చూడటం కోసం ఓ అభిమాని ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు?

Sonu Sood : సోనూ సూద్.. ప్రత్యక్ష దేవుడు. నిజంగా దేవుడు ఉన్నాడో లేడో తెలియదు కానీ.. సోనూ సూద్ ను చూస్తే మాత్రం ప్రత్యక్ష దేవుడిగా కనిపిస్తారు. కరోనా వచ్చాకే తెలిసింది సోనూ సూద్ లో ఉన్న మానవత్వం. గత సంవత్సరం నుంచి ఆపదలో ఉన్నవాళ్లందరికీ తానే దిక్కుగా మారారు. ఎంతో మంది కష్టాలను, కన్నీళ్లను తూడ్చుతూ గొప్ప మనిషి అయ్యారు ఆయన. దేశమంతా ఆయన్ను రియల్ హీరో అంటూ పొగుడుతోంది. కరోనా మొదటి వేవ్ […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :11 June 2021,7:55 pm

Sonu Sood : సోనూ సూద్.. ప్రత్యక్ష దేవుడు. నిజంగా దేవుడు ఉన్నాడో లేడో తెలియదు కానీ.. సోనూ సూద్ ను చూస్తే మాత్రం ప్రత్యక్ష దేవుడిగా కనిపిస్తారు. కరోనా వచ్చాకే తెలిసింది సోనూ సూద్ లో ఉన్న మానవత్వం. గత సంవత్సరం నుంచి ఆపదలో ఉన్నవాళ్లందరికీ తానే దిక్కుగా మారారు. ఎంతో మంది కష్టాలను, కన్నీళ్లను తూడ్చుతూ గొప్ప మనిషి అయ్యారు ఆయన. దేశమంతా ఆయన్ను రియల్ హీరో అంటూ పొగుడుతోంది. కరోనా మొదటి వేవ్ సమయంలో లాక్ డౌన్ విధించినప్పుడు వలస కూలీలను తన సొంత ఖర్చులతో తమ స్వస్థలాలకు పంపించిన గొప్ప మనిషి. ఆ తర్వాత ఆపదలో ఉన్నాం.. అని ఆయన దగ్గరకు వెళ్లిన వాళ్లందరికీ.. తనకు తోచిన సాయం చేస్తున్న సోనూ సూద్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

sonu sood fan meets him in mumbai by walking from hyd

sonu sood fan meets him in mumbai by walking from hyd

అందుకే కాబోలు.. సోనూ సూద్ కు ఓ అభిమాని తన గుండెల్లో గుడి కట్టేశాడు. గుడి కట్టడమే కాదు.. ఆయన్ను ఎలాగైనా కలవాలన్న సదుద్దేశంతో పెద్ద సాహసానికే ఒడిగట్టాడు. దాని కోసం ఓ యువకుడు ఏకంగా హైదరాబాద్ నుంచి ముంబై వరకు.. పాదయాత్ర చేసి మరీ.. సోనూ సూద్ ను కలుసుకున్నాడు. హైదరాబాద్ నుంచి ముంబైకి కనీసం 700 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అయితే.. బస్సుల్లో ట్రెయిన్స్ లో వెళ్లి సోనూసూద్ ను కలిస్తే ఏముంటుంది అని అనుకున్నాడో ఏమో.. తన అభిమానాన్ని పాదయాత్ర రూపంలో చూపించాడు. అది కూడా చెప్పులు లేకుండా.. హైదరాబాద్ నుంచి ముంబైకి సోనూసూద్ ప్లకార్డ్ ను పట్టుకొని కాలినడకన నడవడం ప్రారంభించి.. చివరకు సోనూ సూద్ ఇంటికి చేరుకున్నాడు.

sonu sood fan meets him in mumbai by walking from hyd

sonu sood fan meets him in mumbai by walking from hyd

Sonu Sood : ఇంకెవ్వరూ ఇటువంటి సాహసాలకు ఒడిగట్టకండి

అయితే.. హైదరాబాద్ నుంచి ముంబైకి తనను కలవడానికి వచ్చిన వెంకటేశ్ అనే యువకుడిని కలుసుకున్న సోనూసూద్ ఒకింత ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా అంత దూరం కాలి నడకన.. చెప్పులు లేకుండా నడుచుకుంటూ రావడం తనను బాధించిందన్నారు. వెంకటేశ్ స్ఫూర్తి తనను గర్వపడేలా చేసినా.. ఇలాంటి సాహసాలకు మరెవ్వరూ పాల్పడకూడదంటూ.. సోనూ సూద్.. రిక్వెస్ట్ చేశారు. వెంకటేశ్ యోగక్షేమాలను అడిగిన సోనూ సూద్.. తన నివాసంలో కాసేపు ఉంచుకున్నారు. వెంకటేశ్.. హైదరాబాద్ నుంచి ముంబైకి కాలినడకన వచ్చాడంటూ.. అతడితో దిగిన ఫోటోను సోనూసూద్.. తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది