Virat Kohli : ఎవడు రాస్తాడు ఇలాంటి వార్తలు.. విరాట్ కోహ్లీకి సంబంధించిన వార్తలపై మండిపడ్డ సౌరవ్ గంగూలీ
Sourav Ganguly : విరాట్ కోహ్లీ ఎప్పుడైతే టీ 20 కెప్టెన్సీ నుండి తప్పుకున్నాడో అప్పటి నుండి అతనికి , బీసీసీఐకి మధ్య వార్ తీవ్రంగా నడుస్తుంది. టీ20 ప్రపంచకప్ 2021 అనంతరం టీ20 కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన విరాట్ కోహ్లీ.. మెగా టోర్నీకి ముందే తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని బహిరంగంగా ప్రకటించాడు. దాంతో రోహిత్ శర్మ జట్టు పగ్గాలు అందుకున్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు డిసెంబరులో ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి బీసీసీఐ తప్పించింది. వన్డే, టీ20లకి ఒకరే సారథిగా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నామని సెలెక్టర్లు ప్రకటించారు.
దాంతో బీసీసీఐపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.దక్షిణాఫ్రికా పర్యటనకి వెళ్లే ముందు ముంబయిలో ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన విరాట్ కోహ్లీ.. సౌరవ్ గంగూలీ వ్యాఖ్యలకి వ్యతిరేకంగా మాట్లాడాడు. బీసీసీఐ నిబంధనల ప్రకారం బోర్డుతో సెంట్రల్ కాంట్రాక్ట్‌లో ఉన్న ప్లేయర్ ఇలా బీసీసీఐ లేదా బోర్డులోని అధికారులు, కోచ్‌ల గురించి బహిరంగంగా ఇలా మాట్లాడకూడదు. దాంతో.. రూల్స్ బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీకి షోకాజ్ నోటీసులు పంపాలని సౌరవ్ గంగూలీ భావించినట్లు వార్తలు వచ్చాయి.
Virat Kohli : తప్పుడు వార్తలకి చెక్..
తాజాగా దీనిపై స్పందించిన గంగూలీ ఇవన్నీ గాలి వార్తలనేనని స్పష్టం చేస్తూ పుకార్లని కొట్టిపారేశారు. దాంతో ఆ వార్తలకు ముగింపు పలికినట్లైంది. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ఓటమి అనంతరం కోహ్లీ టెస్ట్ ఫార్మాట్ కెప్టెన్సీకీ కూడా గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సౌతాఫ్రికాతో వన్డే మ్యాచ్‌లు ఆడుతున్న కోహ్లీ పెద్దగా ప్రతిభ కనబరచడం లేదు. రెండో వన్డేలో డకౌట్‌గా వెనుదిరిగి అభిమానులని నిరాశపరిచాడు.