Maha Shivaratri : నాలుగుజాములు, లింగోద్భవ కాలం మీకు తెలుసా?
Maha Shivaratri 2021 : మహాశివరాత్రి అంటే మార్చి 11, గురువారం శివరాత్రి రోజు లింగోద్భవకాలం వస్తుంది. లింగోద్భవకాలం అంటే శివమహాదేవుడు జ్యోతిస్ఫాటిక లింగంగా ఆవిర్భవించిన సమయం. ఈ సమయం చాలా పవిత్రమైంది. ఈసారి శివరాత్రినాడు ఆ సమయంలో పూజచేసుకుంటే విశేష ఫలితం వస్తుంది. ఈసారి లింగోద్భవ సమయం రాత్రి 12.06 నిమిషాల నుంచి 12.55 (ఇంగ్లిష్ లెక్కల ప్రకారం మార్చి 12) నిమిషాల వరకు. ఈ సమయంలో విబూది, రుదాక్షమాల లేదా రుద్రాక్ష ధరించి స్వామిని ఓం నమఃశివాయ పంచాక్షరితో స్వామిని మారేడుదళాలతో పూజించాలి. ధ్యానించాలి, కీర్తించాలి. అభిషేకించాలి.
Maha Shivaratri : నాలుగు జాముల సమయం ఇదే !
మొదటి యామం (జాము)- గురువారం అంటే మార్చి 11 సాయంత్రం 6.27 నిమిషాల నుంచి 9.29 నిమిషాల వరకు.
రెండోజాము – మార్చి 11 రాత్రి 9.29 నిమిషాల నుంచి 12.31 వరకు.
మూడోజాము – మార్చి 11 రాత్రి అంటే తెల్లవారితే శుక్రవారం 12.31 నుంచి 3.32 నిమిషాల వరకు
నాల్గో జాము – గురువారం అర్ధరాత్రి 3.32 నిమిషాల నుంచి 6.34 నిమిషాల వరకు (మార్చి 12)
– ఈ సమయంలో ఆయా జాముల్లో శివుడిని పూజిస్తే విశేష ఫలితాలు వస్తాయి.