Sudheer and Rashmi : మా మధ్య ఏం లేదు అంటారు.. ఢీ షోలో కూడా రొమాన్స్ చేస్తారు? సుధీర్, రష్మీ రచ్చ చూడండి..!
Sudheer and Rashmi : సుడిగాలి సుధీర్, రష్మీ.. వీళ్లు గురించి ఎంత మాట్లాడినా తక్కువే. బుల్లితెర మీద ఈ జంటకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుడిగాలి సుధీర్ గురించి మనకు అందరికీ తెలిసిందే. ఆయన బుల్లితెర మెగాస్టార్. బుల్లితెర మీద ఏ కమెడియన్ కు లేనంత పాపులారిటీ, ఫాలోయింగ్.. సుడిగాలి సుధీర్ కు సొంతం. అందుకే.. సుధీర్ కు ప్రస్తుతం బుల్లితెర మీద అంత డిమాండ్. ఆయన ఏ షోలో ఉంటే ఆ షో సూపర్ సక్సెస్ అయినట్టే. ఆయనతో పాటు ఇక యాంకర్ రష్మీ ఉంటే చెప్పక్కర్లేదు. ఆ షో టీఆర్పీ రేటింగ్స్ బద్దలు అయిపోవాల్సిందే. అది ఆ జంటకు ఉన్న క్రేజ్.

sudigali sudheer and anchor rashmi in dhee show
ఈ జంట ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అద్భుతం. ఆ మధ్య.. వీళ్లిద్దరూ కలిసి జబర్దస్త్ తో పాటు.. పలు ఇతర షోలలో రొమాన్స్ చేశారు. ఆడి పాడారు. మధ్యలో కొన్ని రోజులు గ్యాప్ వచ్చింది. మా మధ్య ఏం లేదు. మేము బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అంటూ రష్మీ కూడా జబర్దస్త్ స్టేజ్ మీదనే ఒకసారి చెప్పుకొచ్చింది. అయినా కూడా ఆ జంటకు క్రేజ్ మాత్రం తగ్గట్లేదు. ఆ మధ్య యాంకర్ రష్మీకి పెళ్లి కుదిరిందనే వార్తలు కూడా వచ్చాయి.
Sudheer and Rashmi : ఓవైపు మా మధ్య ఏం లేదు అంటూనే మరోవైపు రొమాన్స్ చేస్తున్నారు

sudigali sudheer and anchor rashmi in dhee show
అయితే.. ఓవైపు మాత్రం మా మధ్య ఏం లేదు.. అంటున్నారు ఇద్దరు. రష్మీ కూడా అంతే. తాము బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అంటోంది. కానీ.. ఎక్కడో తేడా కొడుతోంది. జబర్దస్త్ లో సుధీర్ స్కిట్ చేస్తే అందులో రష్మీని ఇన్వాల్వ్ చేస్తాడు. ఇన్ డైరెక్ట్ గా ప్రపోజ్ చేస్తాడు.. దానికి రష్మీ చిరునవ్వు నవ్వుతుంది. స్మయిల్ ఇస్తుంది. ఇదంతా ఏంటి? వీళ్ల మధ్య ఏం లేకపోతే.. ఎందుకు వీళ్లు స్టేజ్ మీదనే ఇంత రొమాన్స్ చేస్తున్నారు.. అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఢీ షోలో కూడా వాళ్ల మధ్య మామూలుగా రొమాన్స్ జరగలేదు. అది మాటలతో జరిగే రొమాన్సే. సుధీర్ తనను హగ్ చేసుకోవాలంటూ రష్మీని కోరడం, ఐలవ్యూ చెప్పాలనడం.. దానికి రష్మీ తెగ సిగ్గుపడిపోవడం.. ఇవన్నీ చూస్తుంటే.. వీళ్ల మధ్య ఖచ్చితంగా ఏదో ఉంది.. అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. ఏది ఏమైనా.. తాజాగా విడుదలైన ఢీ 13 షో ప్రోమో ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా దానిపై ఓ లుక్కేయండి.
