YCP : ఏపీలో పోత్తుల వేడీ… ఒంటరిగా వైసీపీ ఎత్తుగడలు.. కలిసివస్తే పరిస్థితి ఏంటి..?
YCP : ఏపీలో రాజకీయాలు కాస్తా ప్రత్యేకంగానే ఉంటాయి. ఏపీ ప్రజలు ఎవరిని ఎప్పుడు గద్దె దింపాలో.. ఎప్పుడు గద్దెనెక్కించాలో బాగా తెలుసు. రాజకీయ ఉద్దండుడు చంద్రబాబును 2019లో పక్కన పెట్టి ఫుల్ మెజార్టీతో వైసీపీకి అధికారం కట్టబెట్టారు. వీళ్ల ముందు బాబు అనుభవం ఏమి పనిచేయలేదు. అయితే వచ్చే ఎన్నికల్లో పొత్తులు పొడిచేలా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం వైసీపీపై వ్యతిరేకత ఉండటంతో గత ఎన్నికల్లో చేసిన తప్పులు చేయకుండా టీడీపీ పావులు కదుపుతోంది. ఎలాగైనా జగన్ ప్రభుత్వం మళ్లి అధికారాన్ని చేజిక్కించుకోకుండా కలిసి పోరాడలని టీడీపీ ప్రయత్నిస్తోంది. వైసీపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలు కలసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రీసెంట్ గా చంద్ర బాబు చేసిన వ్యఖ్యలు అందుకు ఆజ్యం పోస్తున్నాయి.
2014 ఎన్నికల్లో వైపీపీకి అనుకూలంగా సర్వేలు వచ్చినా బీజేపీ, జనసేనతో కలిసి టీడీపీ అధికారం సొంతం చేసుకుంది. ఈ ఎన్నికల్లో జనసేనా పోటీ చేయకపోయినా మద్దతు నిచ్చింది.అయితే 2014 ఎన్నికల తర్వాత టీడీపీకి మిత్రపక్షాలు దూరమయ్యాయి. చంద్రబాబు ఏకంగా బీజేపీని టార్గెట్ చేశాడు. జనసేనానిని పట్టించుకోలేదు. దీంతో 2019 ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేసి దారుణంగా విఫలం అయింది. వైసీపీ ఏకంగా 151 సీట్లు సాధించి గద్దెనెక్కింది. వాస్తవానికి జగన్ 2104 ఎన్నికలు బెడిసి కొట్టిన తర్వాత పాదయాత్ర బాట పట్టారు. ప్రజలకు దగ్గరయ్యారు… ఒక్క చాన్స్ అంటూ వేడుకున్నాడు. అలాగే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సాయం తీసుకుని సక్సెస్ అయ్యారు. ఈ ఎన్నికల్లో జనసేన ఒక్క సీటుతో సరిపెట్టుకుంది. అయితే చాలా చోట్ల మాత్రం 40 నుంచి 50 వేల ఓట్లు సాధించింది. అయితే టీడీపీతో పొత్తు ఉండుంటే ఎంతో కొంత ఫలితం ఉండేది.

tdp and janasena Comments on YCP
ఎన్నికలకు ఇంకా రెండేళ్లు సమయం ఉన్నా.. అధికార ప్రతి పక్షాలు దూకుడు పెంచాయి. ఈ సారి కూడా వైసీపీ ఒంటరిగానే పోటీ చేసి నెగ్గాలని చూస్తోంది. పైగా ఎన్నికల వ్యూహకర్త పీకే లేకుండానే సొంత వ్యూహ రచనతో ముందుకు వెళ్తున్నారు. ఉత్తరాంధ్రాలో సెంట్ మెంట్ రగుల్చుతూ పోటాపోటీగా పర్యటనలు చేస్తున్నారు. టీడీపీ కూడూ ఎన్నికల వ్యూహ కర్తలు అవసరం లేదంటూ తన రాజకీయ చతురతక పదును పెడుతున్నారు. అయితే ఈసారి ఒంటరిగా కాకుండా జనసేన, బీజేపీ, లెఫ్ట్ పార్టీలతో పొత్తులకు ఆహ్వానిస్తున్నారు. అయితే జనసేన, టీడీపీ అభిప్రాయాలు వేరైనా లక్ష్యం మాత్రం ఒక్కటే.. అదేంటంటే జగన్ ని గద్దె దింపడమే.
అందుకే 2014 ఎన్నికల మాదిరి పొత్తులు పొడిచేలా ఉన్నాయని చర్చ సాగుతోంది. పలుమార్లు చంద్రబాబు కూడా ఓపెన్ గానే పొత్తులపై మాట్లాడటంతో ఖయమనిపిస్తోంది. జనసేన ఇప్పటికైనతే ఎలాంటి క్లారిటీ ఇవ్వనప్పటికీ కలిసి వచ్చే సూచనలు ఉన్నాయని సమాచారం.ఇందుకు వైసీపీ ఎత్తుగడలు వేస్తోంది. జనసేన టీడీపీ దత్తపుత్రుడు అంటూ కలవకుండా ప్రయత్నిస్తోంది. దీనిపై పవన్ కూడా చాలా సార్లు కౌంటర్ ఇచ్చారు. మరోసారి దత్తపుత్రుడు అంటే మిమ్మల్ని సీబీఐకి దత్తపుత్రులు అనాల్సివస్తుందని గట్టిగానే చెప్పారు. అయితే వైపీపీ ప్రతిపక్షాలు పొత్తులు పెట్టుకుంటే ఏం చేయాలో.. ఎత్తుగడలు వేస్తోంది.