పార్టీ మారే ఆలోచన ఉన్న పురంధేశ్వరి..!
Daggubati Purandeswari : ఎన్టీఆర్ నలుగురు కుమార్తెల్లో రాజకీయాల్లోకి వచ్చిన ఏకైక కుమార్తె దగ్గుబాటి పురంధేశ్వరి Daggubati Purandeswari. ఆమెకి ప్రస్తుతం బ్యాడ్ టైమ్ నడుస్తోంది. పురంధేశ్వరి Daggubati Purandeswari బీజేపీలోకి వచ్చి ఏడేళ్లు అవుతున్నా, మంచి పదవులే వరిస్తున్నా అవేవీ ఆమెకి పొలిటికల్ గా మరోసారి పెద్దగా బ్రేక్ ఇవ్వలేకపోతున్నాయి. పురంధేశ్వరి ప్రస్తుతం బీజేపీ జాతీయ కార్యదర్శిగా.. ఛత్తీస్ గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. రాజకీయాల్లోకి వచ్చీ రావటంతోనే వరుసగా రెండు సార్లు లోక్ సభ ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా ప్రమోషన్ కూడా పొందిన పురంధేశ్వరి ఆ తర్వాత జరిగిన జనరల్ ఎలక్షన్స్ లోనూ వరుసగా రెండు సార్లు ఓడిపోవటంతో లెక్క సరిపోయింది.
ఏపీలో కష్టమే..
ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అత్తెసరు మార్కులు కూడా పొందలేకపోతుండటంతో పార్టీ పెద్దలు అత్యాశలేమీ పెట్టుకోవట్లేదు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో పొత్తు పెట్టుకున్నా, పవర్ స్టార్ ని ముఖ్యమంత్రి క్యాండేట్ గా ప్రకటించినా పరిస్థితిలో మార్పు రాకపోవచ్చు. కాబట్టి పురంధేశ్వరి Daggubati Purandeswari ఇక ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచే ఛాన్స్ లేవనిపిస్తోంది. అందువల్ల రాజ్యసభకు నామినేట్ చేస్తే తప్ప ఆమె మళ్లీ జాతీయ స్థాయిలో తెర మీదికి రాలేరు. ఈ నేపథ్యంలో పురంధేశ్వరి మరోసారి కేంద్రమంత్రి పదవిపై కన్నేసే సాహసం కూడా చేయకపోవచ్చు. కాలం కలిసి రాకపోతే ఎంత కష్టపడ్డా వేస్టే. గతంలో కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు ఉండబట్టే పురంధేశ్వరి లాంటి వాళ్లు అనూహ్యంగా నేషనల్ లీడర్లు అయిపోయారు.
తప్పనిసరి పరిస్థితుల్లో.. : Daggubati Purandeswari
దగ్గుబాటి పురంధేశ్వరి ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లోనే బీజేపీలో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి పోదామంటే అక్కడా ఆశాజనకమైన వాతావరణం లేదు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీలోకి వెళదామంటే ఆల్రెడీ తన భర్త ఒకసారి జాయిన్ కావటం, ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎలక్షన్ లో పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోవటం, ప్రజెంట్ గా పాలిటిక్స్ కి దూరంగా ఉంటుండటం చూస్తూనే ఉన్నాం. పురంధేశ్వరి తెలుగుదేశం పార్టీలోకి ఎలాగూ పోదు. ఇంకా పక్క చూపులు చూద్దామంటే వేరే పార్టీలు కూడా ఏమీ లేవు.
మరో మూడేళ్లు..
దగ్గుబాటి పురంధేశ్వరి Daggubati Purandeswari కి మరో మూడేళ్లపాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు. పురంధేశ్వరి సరైన సమయంలోనే కమలం పార్టీలో చేరారు కానీ కాంగ్రెస్ పార్టీలో లభించినంత ఈజీగా పదవులు వరించలేదు. అప్పుడంటే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు వ్యతిరేకంగా, ఎన్టీఆర్ కూతురు అనే సెంటిమెంటుతో సోనియాగాంధీ ఎంకరేజ్ చేశారు. బీజేపీకి అలాంటి పట్టింపులేమీ లేవు. ఆంధ్రప్రదేశ్ లో పురంధేశ్వరి లాంటి వాళ్లతో ప్రయోగాలు చేసినా ఫలితాలు వచ్చే సూచనలు కనుచూపు మేరలో లేవు. కాబట్టి దగ్గుబాటి పురంధేశ్వరికి మళ్లీ మంచి రోజులు ఎప్పుడొస్తాయో అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.