Ys Jagan : సీఎం జ‌గ‌న్‌పై వాళ్లంతా సీరియ‌స్‌గా ఉన్నారంటా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ys Jagan : సీఎం జ‌గ‌న్‌పై వాళ్లంతా సీరియ‌స్‌గా ఉన్నారంటా..?

 Authored By kondalrao | The Telugu News | Updated on :14 June 2021,1:54 pm

Ys Jagan : దేశవ్యాప్తంగా ప్రభుత్వ పరిపాలన 90 శాతం మండల కేంద్రం వరకే చేరుతోంది. అంటే సర్కారు అధికారితో ఏదైనా పని పడితే ప్రజలు మండల కేంద్రానికి వెళ్లాల్సిందేనన్న మాట. తీరా అక్కడికి వెళితే మనం కలవాల్సిన సారు ఆ రోజు డ్యూటీకి వస్తారో రారో తెలియదు. ఒక వేళ వచ్చినా ఫీల్డ్ కి వెళ్లిపోతే మళ్లీ ఆఫీసుకి ఎప్పుడు చేరుకుండో చెప్పలేం. ఆ విధంగా జనం చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల వద్దకు పాలన కోసం పరితపించారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నించినా వంద శాతం ప్రజల వద్దకు పాలన చేరలేదు. ఆ లోటును వైఎస్సార్సీపీ గవర్నమెంట్ తీర్చిందనే చెప్పాలి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేయటంతో ప్రజలు మండల కేంద్రాలకు వెళ్లాల్సిన బాధలు తప్పాయి. అంతేకాదు. ఏపీలో దాదాపు నాలుగు లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి కూడా దొరికింది.

ఆనందం.. ఆవిరి..

గ్రామ, వార్డు వాలంటీర్, సచివాలయ సిబ్బంది ఉపాధి దొరికిన కొత్తలో చాలా సంతోషంగా విధులు నిర్వహించేవారు. కానీ వాళ్ల మీద రోజురోజుకీ పని ఒత్తిడి పెరగటంతో నలిగిపోతున్నారు. పని భారం పెరుగుతోంది తప్ప తమకు వచ్చే పైసలు (శాలరీ) పెరగకపోవటంతో వాళ్లకు ఏం చేయాలో తోచట్లేదు. ఉద్యోగ భద్రత లేదు. ప్రమోషన్ లేదు. ఇంక్రిమెంట్లు లేవు. ఇన్సెంటివ్స్ లేవు. కేవలం నెలకు రూ.15 వేలకే బండ చాకిరీ చేయాల్సి వస్తోంది. డిగ్రీలు చదివి అంత కష్టపడి పనిచేస్తున్నా జాబ్ శాటిస్ ఫ్యాక్షన్ ఉండట్లేదు. అక్షరమ్ముక్క రాని వ్యక్తి కూలి పనికి పోయినా నెల రోజుల్లో ఈజీగా రూ.15 వేలు సంపాదిస్తున్నాడు. దీంతో సంపాదన విషయంలో చదువుకున్నోడికి, చదువులేనోడికి మధ్య తేడా లేకుండా పోతోంది?. ఇదేంటని అడిగితే రిమార్క్ పడుతుందేమో, ఉన్న ఉపాధి కూడా ఊడుతుందేమో అని వాలంటీర్లు భయపడుతున్నారు. తమ ఆవేదనను ఎవరికి చెప్పుకోవాలో తెలియక కుమిలిపోతున్నారు.

cm ys jagan must take care of volunteers

cm ys jagan must take care of volunteers

వేధింపులు..: Ys Jagan

వాలంటీర్లకు పైఆఫీసర్ల నుంచి, ప్రజల నుంచి, పొలిటికల్ లీడర్ల నుంచి ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీల నాయకుల నుంచి ఒత్తిళ్లు వస్తుంటాయి. మేం చెప్పిన పని ఎక్కడి వరకు వచ్చిందంటూ నిత్యం ఎవరో ఒకరు నిలదీస్తుంటారు. దీంతో మానసిక ప్రశాంతత ఉండట్లేదు. మండల కేంద్రంలో ఉండే పర్మనెంట్ ప్రభుత్వాధికారులేమో లక్షల్లో శాలరీలు తీసుకుంటూ చేతిలో పనిలేక కాలక్షేపం చేస్తున్నారని, కింది స్థాయి వాలంటీర్ల మీదే అన్నీ రుద్దుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. తన మానస పుత్రికగా మంచి పేరు తెచ్చుకున్న ఈ వాలంటీర్ల వ్యవస్థపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన కరుణా కటాక్షాలను ఎప్పుడు కురిపిస్తారోనని బాధితులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

ఇది కూడా చ‌ద‌వండి ==> Sonu Sood : వైఎస్సార్సీపీ సోనూసూద్ తో పెట్టుకుంటోందేంటి…?

ఇది కూడా చ‌ద‌వండి ==> వైసీపీ మంత్రికి తీవ్ర అవ‌మానం…!

ఇది కూడా చ‌ద‌వండి ==> Pk Plan : వైఎస్ జగన్ , పీకేల మధ్య చెడిందా..? ఈసారి తెలంగాణలో అడుగుపెడుతోన్న పీకే..!

ఇది కూడా చ‌ద‌వండి ==> పార్టీ మారే ఆలోచ‌న ఉన్న పురంధేశ్వరి..!

Advertisement
WhatsApp Group Join Now

kondalrao

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది